Samsung vs itel 5G : శాంసంగ్ గెలాక్సీ F06 5G, ఐటెల్ A95 5G.. ఫీచర్లు మాత్రం కేక.. రూ.10వేల లోపు ధరలో ఏది కొంటే బెటర్?
Samsung vs itel 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ F06 5G, ఐటెల్ A95 5G ఫోన్ రెండింటిలో ఏ ఫోన్ కొంటే బెటర్.. రూ. 10వేల లోపు ధరలో ఏ ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉందంటే?

Samsung vs itel 5G
Samsung vs itel A95 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో అతి తక్కువ ధరకే 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఐటెల్ A95 5G ఫోన్ ఇప్పటికే లాంచ్ కాగా, శాంసంగ్ గెలాక్సీ F06 5G కూడా లభ్యమవుతోంది.
ఐటెల్ A95 5G ఫోన్ 6.67-అంగుళాల HD+ IPS డిస్‌ప్లే, శాంసంగ్ గెలాక్సీ F06 5జీలో, స్క్రీన్ 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ F06 5G, ఐటెల్ A95 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.
ధర, స్టోరేజీ :
4GB ర్యామ్, 128GB స్టోరేజీతో ఐటెల్ A95 5G మోడల్ ధర రూ.9,599. అదనంగా, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999. అదే సమయంలో, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ శాంసంగ్ గెలాక్సీ F06 5G మోడల్ ధర రూ.9,999కు పొందవచ్చు. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.11,499కు పొందవచ్చు.
డిస్‌ప్లే :
ఇంటెల్ A95 5జీ ఫోన్ 6.67-అంగుళాల ఐపీఎస్ పంచ్-హోల్ డిస్‌ప్లే HD ప్లస్ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ 6.7-అంగుళాల స్క్రీన్‌ను 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 90 Hz రిఫ్రెష్ రేట్, HD ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది.
ప్రాసెసర్ :
ఐటెల్ A95 5G ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌కు పవర్ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ శాంసంగ్ గెలాక్సీ F06 5జీకి పవర్ అందిస్తుంది.
స్టోరేజీ, ర్యామ్ :
ఇంటెల్ A95 5G ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 4GB, 6GB ర్యామ్ కలిగి ఉంది. మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ 64GB లేదా 128GB వరకు స్టోరేజ్, 4GB లేదా 6GB ర్యామ్ కలిగి ఉంది. స్టోరేజ్ సాయంతో ర్యామ్ 12GB వరకు విస్తరించవచ్చు.
బ్యాకప్ బ్యాటరీ :
ఐటెల్ A95 5G ఫోన్ 5,000mAh బ్యాటరీ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ F06 5జీ 5,000mAh బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Read Also : BSNL 5G SIM Delivery : BSNL కొత్త 5G సిమ్ కావాలా? కేవలం 90 నిమిషాల్లోనే హోం డెలివరీ.. ఎలా బుక్ చేయాలంటే?
కెమెరా సెటప్ :
ఐటెల్ A95 5G బ్యాక్ సైడ్ 50MP సూపర్ HDR కెమెరా ఉంది. సెల్ఫీల కోసం వీడియో కాల్స్ చేసేందుకు 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. శాంసంగ్ గెలాక్సీ F06 5Gలో 50MP ఫ్రంట్ కెమెరా, 2MP బ్యాక్ కెమెరా ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.