Amazon Summer Sale : మే 1 నుంచే అమెజాన్ సమ్మర్ సేల్.. ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13Rపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
Amazon Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 మే 1 నుంచి ప్రారంభం కానుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్‌టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.

Amazon Summer Sale
Amazon Summer Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. మే 1 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. గ్రేట్ సమ్మర్ సేల్ మే 1న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
మీరు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వివిధ రకాల ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన డీల్స్ పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. ప్రైమ్ మెంబర్లు అర్ధరాత్రి నుంచే 12 గంటల ముందస్తుగా సేల్ ఆఫర్లను యాక్సెస్ చేయొచ్చు. మొబైల్స్, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చు.
Read Also : Jio Recharge Offers : వారెవ్వా.. జియో కొత్త ప్లాన్ అదుర్స్.. ఈ సింగిల్ రీఛార్జ్‌తో ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!
అమెజాన్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు :
అమెజాన్ ఇప్పటికే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ధర తగ్గింపు అందిస్తోంది. గ్రేట్ సమ్మర్ సేల్ 2025 సందర్భంగా కొన్ని ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 15 : రూ. 57,749 (బ్యాంక్ ఆఫర్)
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా : రూ. 84,999 (కూపన్ ఆఫర్)
ఫ్రీ వన్‌ప్లస్ బడ్స్ 3తో వన్‌ప్లస్ 13R : రూ. 39,999 (బ్యాంక్ ఆఫర్)
ఐక్యూ నియో 10R : రూ. 24,999 (బ్యాంక్ ఆఫర్)
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ : రూ. 15,999 (బ్యాంక్ ఆఫర్)
షావోమీ 14 సివి : రూ. 32,999 (బ్యాంక్ ఆఫర్)
ఐక్యూ Z10x 5G : రూ. 13,249 (బ్యాంక్ ఆఫర్)
ఇతర డీల్స్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ M35 5G, రెడ్‌మి A4 5G, రియల్‌మి నార్జో 80x 5G, టెక్నో పాప్ 9 వంటి ఫోన్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.
బ్యాంక్ కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు :
అమెజాన్ కొన్ని బ్యాంక్ కస్టమర్లకు అదనపు సేవింగ్స్ అందిస్తోంది. HDFC బ్యాంక్ వినియోగదారులు తమ క్రెడిట్ కార్డులపై లేదా EMI ఆప్షన్లను ఎంచుకుంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మరోవైపు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ సేల్ సమయంలో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మీరు కొనుగోళ్లకు అమెజాన్ గిఫ్ట్ కార్డులను ఉపయోగిస్తే.. అదనంగా 10 శాతం తగ్గింపును పొందవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లను మించిన డీల్స్ :
గ్రేట్ సమ్మర్ సేల్ కేవలం స్మార్ట్‌ఫోన్‌ల గురించి మాత్రమే కాదు. అమెజాన్ TWS ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్‌పై కూడా ధరలను తగ్గించే అవకాశం ఉంది. ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్లు, డీల్స్ కొనుగోలుదారులకు మరింత సరసమైన ధరకే లభ్యమవుతాయి.
ఆఫర్ల పూర్తి జాబితా ఇంకా వెల్లడి కాలేదు. భారీ డిస్కౌంట్లు, ఆకట్టుకునే డీల్స్ కోసం అమెజాన్ ఈ సేల్ అందిస్తోంది. రాబోయే రోజుల్లో అమెజాన్ మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. అప్పటివరకూ ఆగాల్సిందే మరి.