iOS 26 4 Beta 1
iOS 26 4 Beta 1 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆపిల్ iOS 26.4 ఫస్ట్ డెవలపర్ బీటాను రిలీజ్ అయింది. అడ్వాన్స్ యాక్సెస్ పొందే ఐఫోన్ యూజర్లు ఈ బీటా వెర్షన్ ట్రై చేయొచ్చు. ఈ కొత్త అప్‌డేట్ లేటెస్ట్ ఫీచర్లు, మైక్రో ఇంటర్‌ఫేస్ అప్ గ్రేడ్ వంటి సెక్యూరిటీ అప్‌గ్రేడ్స్ ఉంటాయి.
ప్రస్తుతానికి, రిజిస్టర్డ్ డెవలపర్‌లకే ఈ బీటా వెర్షన్ అందుబాటులో ఉంటుంది. కానీ, పబ్లిక్ బీటా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అతి త్వరలో స్టేబుల్ వెర్షన్ కూడా రిలీజ్ కావొచ్చు. ఐఓఎస్ 26.4 బీటా 1 అప్ డేట్ ఫీచర్లు ఏంటి? ఏ ఐఫోన్లలో సపోర్టు చేస్తుందో ఇప్పుడు చూద్దాం..
మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లలో మార్పులు :
యూజర్ ఫ్రెండ్లీ కోసం మ్యూజిక్ యాప్‌లోకి వస్తుంది. ఐఫోన్ తయారీదారు కొత్త “Concerts Near You” సెక్షన్ ప్రవేశపెట్టారు. మీరు వినే మ్యూజిక్ ఆధారంగా లైవ్ ఈవెంట్‌లను సిఫార్సు చేస్తుంది. మీ ప్లేలిస్ట్ ఇండీ రాక్ లేదా కె-పాప్ వంటి సూచనలు కనిపిస్తాయి. ఆల్బమ్, ప్లే లిస్ట్ పేజీలు కూడా రిఫ్రెష్ అవుతాయి.
ఇప్పుడు ఫుల్-స్క్రీన్ ఆర్ట్‌వర్క్ ఉంటుంది. ఆపిల్ పాడ్‌కాస్ట్‌లు కూడా వీడియోలో కనిపించనున్నాయి. iOS 26.4 బీటా 1తో వినియోగదారులు యాప్ లోపల నేరుగా వీడియో పాడ్‌కాస్ట్‌లను చూడవచ్చు. ఆడియో, వీడియో మధ్య ఈజీగా స్విచ్ అవ్వొచ్చు. ఎపిసోడ్‌లను ఆఫ్‌లైన్ వ్యూ కోసం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సేఫ్టీ పరంగా ఆపిల్డిఫాల్ట్‌గా స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసింది. మీ ఐఫోన్ తెలిసిన ప్రాంతాల నుంచి దూరంగా ఉంటే అదనపు వెరిఫికేషన్ లేయర్ ఆటోమాటిక్‌గా ఎనేబుల్ అవుతుంది. ఆర్‌సీఎస్ మెసేజింగ్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అడ్వాన్స్ టెస్ట్ కూడా ఉంది.
జీఎస్ఎమ్ అసోసియేషన్ భాగస్వామ్యంతో డెవలప్ అయింది. పూర్తిగా రన్ అయ్యే ముందు క్రాస్-ప్లాట్‌ఫామ్ మెసేజింగ్ ప్రైవసీని అందిస్తుంది. ఈ అప్‌డేట్ కొత్త యాంబియంట్ మ్యూజిక్ విడ్జెట్, రీడిజైన్ వాల్‌పేపర్, వాచ్ ఫేస్ గ్యాలరీని తీసుకువస్తుంది. ఆపిల్ యాప్‌లలో సింగిల్ ఆపిల్ అకౌంట్ ఇంటర్‌ఫేస్ కోసం కూడా ట్రై చేస్తోంది.
iOS 26.4 బీటా 1 ఎలా డౌన్‌లోడ్ చేయాలి? :
ప్రస్తుతానికి, ఆపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ మెంబర్లు మాత్రమే బీటాను ఇన్‌స్టాల్ చేయొచ్చు. మీరు రిజిస్టర్ చేసుకుంటే Settings > General ఆప్షన్ ట్యాప్ చేయండి. ఆపై Software Update ట్యాప్ నొక్కండి.
బీటా అప్‌డేట్స్ కింద iOS 26.4 డెవలపర్ బీటా ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు అప్‌డేట్ ఏదైనా స్టాండర్డ్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ మాదిరిగా కనిపిస్తుంది. మిగతా వారందరూ పబ్లిక్ బీటా రోల్ అవుట్ కోసం వేచి ఉండాల్సిందే..
సపోర్టు చేసే ఐఫోన్లు :
iOS 26.4 బీటా 1, సెకండ్ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ, కొత్త వాటితో పాటు, ఐఫోన్ 17, 16, 15, 14, 13, 12, 11 సిరీస్‌లతో సహా వైడ్ రేంజ్ మోడళ్లకు సపోర్టు ఇస్తుంది. ఎప్పటిలాగే, బీటా సాఫ్ట్‌వేర్ అన్‌స్టేబుల్ ఉండవచ్చు. ప్రైమరీ డివైజ్‌లో ముందుగా ఇన్‌స్టాల్ చేయకపోవడమే బెటర్.