iOS 26 Release : టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ iOS 26 (iOS 26) వెర్షన్‌ను ప్రకటించింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2025లో మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ డివైజ్‌ల కోసం iOS 26.1 ప్రవేశపెట్టింది.
ఈ కొత్త అప్‌డేట్ iOS 7 తర్వాత మొట్టమొదటి బిగ్ డిజైన్ కలిగి ఉంది. iOS 26తో సపోర్టు చేసే అన్ని ఐఫోన్‌లు కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్‌ను పొందుతాయి. ఇంటర్‌ఫేస్‌కు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది. యాప్ ఐకాన్స్, విడ్జెట్‌లు, మెనూలు, బటన్‌లు క్లీనర్‌గా కనిపిస్తాయి.
iOS 26 రిలీజ్ డేట్ :
WWDC ఈవెంట్ తర్వాత iOS 26 ఇప్పుడు డెవలపర్ బీటా స్టేజీలో ఉంది. వచ్చే జూలై ప్రారంభంలో పబ్లిక్ బీటాను ఆపిల్ రిలీజ్ చేయనుంది. ఫైనల్ వెర్షన్ సెప్టెంబర్ మధ్యలో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
iOS 26 బీటా డౌన్‌లోడ్ చేయడం ఎలా?
మీ ఐఫోన్‌లో iOS 26 బీటా ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు. 2023లో ఆపిల్ ఐఫోన్ యూజర్లు iOS డెవలపర్ బీటా వెర్షన్ పొందారు. ఇప్పుడు, యాక్సెస్ కోసం ప్రత్యేకించి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆపిల్ డెవలపర్ ప్రోగ్రామ్‌లో చేరాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఉచితంగా ఆపిల్ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ద్వారా ఆపిల్ ఐడితో సైన్ ఇన్ చేయవచ్చు.
iOS 26 డెవలపర్ బీటా 1 ఇన్‌స్టాల్ చేసేందుకు ఇలా చేయండి. మీ ఐఫోన్ Settings > General > Software Update > Beta Updates వెళ్లాలి. డెవలపర్ బీటా ఆప్షన్ ఎంచుకోండి. అప్‌డేట్ డౌన్‌లోడ్, ఇన్‌స్టాలేషన్ కోసం అందుబాటులో ఉంటుంది. ఏదైనా బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు మీ ఐఫోన్‌ను బ్యాకప్ చేసుకోవడం మర్చిపోవద్దు.
iOS 26 అప్‌డేట్ : సపోర్టు చేసే ఐఫోన్లు :
ఆపిల్ iOS 26 అప్‌డేట్ కొత్త ఐఫోన్‌లకు సపోర్టు ఇస్తూనే ఉంది. సపోర్టు చేసే ఐఫోన్ల అంచనా జాబితాలో ఐఫోన్ 17, ఐఫోన్ 17 Pro, ఐఫోన్ 17 Pro మ్యాక్స్, ఐఫోన్ 17 Air మొత్తం ఐఫోన్ 16, 15, 14, 13 లైనప్‌లు, ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ SE (2వ జనరేషన్, ఆపై కొత్తవి) ఉన్నాయి.
iOS 26 ఇన్‌స్టాల్ చేసేందుకు ఐఫోన్‌లో 6GB నుంచి 8GB వరకు స్టోరేజీ అవసరం. ఈ అప్‌డేట్‌లో బ్యాటరీ కనీసం 50 శాతం ఛార్జ్ అయి ఉండాలి. ఫోన్ ఛార్జింగ్ ప్లగ్ చేసి ఉండాలి. అలాగే అప్‌డేట్ ఇన్‌స్టాలేషన్ వేగంగా పూర్తి అయ్యేందుకు స్టేబుల్ Wi-Fi కనెక్షన్ కూడా చాలా అవసరం.
iOS 26 ఫీచర్లు :
ఆపిల్ iOS 26 అనేక రకాల స్మార్ట్, అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. లాక్ స్క్రీన్ క్లాక్ డిస్‌ప్లే కలిగి ఉంది. క్లీనర్ కోసం సఫారీ ఫ్లోటింగ్ ట్యాబ్ బార్, ఎడ్జ్-టు-ఎడ్జ్ బ్రౌజింగ్‌తో రీడిజైన్ అందిస్తుంది. కెమెరా యాప్ తక్కువ బటన్లు మరింత ఫోకస్డ్ లేఅవుట్‌తో వస్తుంది.
ఫోన్ యాప్ కొత్త కాల్ స్క్రీనింగ్ ఫీచర్, మీ ఐఫోన్ కాల్ వస్తే ఆటోమాటిక్‌గా ఆన్సర్ ఇస్తుంది. మెసేజెస్ యాప్‌లో గ్రూప్ చాట్‌లలో పోల్‌లను క్రియేట్ చేయొచ్చు. లైవ్ టైపింగ్ ఇండికేషన్లను చూడవచ్చు. AI-జనరేటెడ్ లేదా కస్టమ్ చాట్ బ్యాక్ గ్రౌండ్స్ కూడా సెట్ చేయవచ్చు.
అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లలో లైవ్ ట్రాన్స్‌లేషన్ ఒకటి. ఫోన్ కాల్స్, ఫేస్‌టైమ్, టెక్స్ట్ కన్వర్జేషన్ సమయంలో రియల్ టైమ్ ట్రాన్సులేషన్ సపోర్టు చేస్తుంది. ఆపిల్ మ్యాప్స్ కూడా మరింత స్మార్ట్‌గా మారుతోంది. ఈజీగా డైరెక్షన్ తెలుసుకోవచ్చు. బయలుదేరే ముందు ట్రాఫిక్ అలర్ట్స్ పంపిస్తుంది.
సందర్శించిన ప్రదేశాలను స్నేహితులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఐఫోన్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ హైలెట్.. మీ ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసుకొని దుస్తులను గుర్తించమని అడగొచ్చు. క్యాలెండర్ ఈవెంట్‌లను క్రియేట్ చేయొచ్చు. మరిన్ని వివరాలను చెక్ చేయమని అడగవచ్చు.