Passwords Leak Online : యూజర్లకు గూగుల్ వార్నింగ్.. ఆన్‌లైన్‌లో 1600 కోట్లకు పైగా పాస్‌వర్డ్‌లు లీక్.. మీ డేటా సేఫ్టీ కోసం వెంటనే ఇలా చేయండి..!
Passwords Leak Online : 1600 కోట్లకు పైగా ఇమెయిల్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ క్రమంలోనే గూగుల్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది.

Passwords Leak Online
Passwords Leak Online : ఆన్ లైన్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక జారీ చేసింది. మీరు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, జీమెయిల్ లేదా సోషల్ మీడియాను వాడుతుంటే ఇది మీకోసమే.. ఇటీవలే
భారీ డేటా ఉల్లంఘన (Google data breach) వెలుగులోకి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లకు పైగా వినియోగదారుల ఇమెయిల్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయి. సైబర్ సెక్యూరిటీ పరిశోధకుల ప్రకారం.. చరిత్రలో అతిపెద్ద డేటా లీక్‌లలో ఇదొకటి. గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్, టెలిగ్రామ్ వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై నేరుగా ప్రభావం పడుతుంది. మీ డేటా సేఫ్టీ కోసం ముందుగా అకౌంట్ల పాస్‌వర్డులను అప్‌డేట్ చేసుకోండి.
అన్ సెక్యూర్డ్ సర్వర్‌లో డేటా :
లీకైన సమాచారం అన్ సెక్యూర్డ్ సర్వర్‌లో గుర్తించింది. ఒకటి రెండు ప్రయత్నాల్లోనే ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, VPN, బిజినెస్ ఇమెయిల్స్, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ఆధారాలతో సహా వ్యక్తిగత, కార్పొరేట్ డేటాను హై రిస్క్‌లో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాత, కొత్త పాస్‌వర్డులు బహిర్గతం :
నివేదికల ప్రకారం.. డేటాలో పాత, కొత్త పాస్‌వర్డ్‌లు రెండూ ఉన్నాయి. ఇలాంటివి దుర్వినియోగం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. 350 కోట్లకు పైగా రికార్డులు ఉన్న 30కి పైగా డేటాబేస్‌లను సమీక్షించామని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఉల్లంఘన 2025 ప్రారంభం నుంచి నేటి వరకు విస్తరించి ఉందని, ఇటీవల అప్‌డేట్ చేసిన పాస్‌వర్డ్‌లు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.
యూజర్లకు గూగుల్ ఎమర్జెన్సీ అలర్ట్ :
గూగుల్ యూజర్లు వెంటనే అప్రమత్తమై తమ అకౌంట్లకు సంబంధించి పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక అడ్వైజరీని జారీ చేసింది.
- ముఖ్యంగా ఇమెయిల్, బ్యాంకింగ్ వంటి కీలకమైన సర్వీసుల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చండి.
- క్యాపిటల్ లెటర్స్, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్లు కలిగిన స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి.
- అదనపు ప్రొటెక్షన్ కోసం టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేయండి.
- ఫిషింగ్, పాస్‌వర్డ్ ఆధారిత దాడులను నిరోధించడానికి పాస్‌కీని యాక్టివేట్ చేయండి.
- అనుమానాస్పద లేదా తెలియని లింక్‌లపై క్లిక్ చేయొద్దు.
- ఇమెయిల్స్ లేదా ధృవీకరించని మెసేజ్‌ల ద్వారా వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ షేర్ చేయొద్దు.
ఈ ప్లాట్‌ఫామ్‌లకు హైరిస్క్ :
డేటా లీక్ ఏదో సర్వీసుకు పరిమితం కాదు. గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, కార్పొరేట్ నెట్‌వర్క్‌ల వినియోగదారులు కూడా రిస్క్‌లో ఉన్నారు. చాలా మంది ప్లాట్‌ఫామ్‌లలో ఒకే పాస్‌వర్డ్‌లను వాడుతుంటారు. ఇలా లీక్ అయిన పాస్‌వర్డులతో అన్ని గూగుల్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
వెంటనే ఇలా చేయండి :
కొంతకాలంగా మీ పాస్‌వర్డ్‌ను అప్‌డేట్ చేయకపోతే ఇదే సరైన సమయం. పాస్‌వర్డ్ మేనేజర్ ఉపయోగించండి. మీ గూగుల్ అకౌంట్లను క్రమం తప్పకుండా మానిటర్ చేయండి. ఫిషింగ్, సైబర్ మోసాల బారిన పడకుండా ప్రొటెక్ట్ చేసుకోండి.