5G iPhone 12 ఎడిషన్.. 4 కొత్త మోడళ్లలో ఎంట్రీ.. మీరు ఏ ఐఫోన్ కొనాలంటే?

  • Publish Date - October 14, 2020 / 06:29 PM IST

5G iPhone 12 Edition : 5G యుగంలోకి స్వాగతమంటూ ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చేసింది. ఆపిల్ తన మొట్టమొదటి ఫ్లాగ్ షిప్ 5G ఐఫోన్లను లాంచ్ చేస్తోంది.

ఈ ఏడాదిలో ఆపిల్ నుంచి 4 ఐఫోన్ కొత్త బ్రాండ్ మోడళ్లను తీసుకొస్తోంది. ఇటీవలే 5G నెట్ వర్క్ కనెక్షన్ల కోసం అమెరికాలోని పలు ప్రాంతాల్లో టెస్టింగ్ డ్రైవింగ్ జరుగుతోంది.

రియల్ డివైజ్‌ల్లో అసలైన కనెక్షన్ ఎంత స్పీడ్ ఉంటుందో టెస్టింగ్ చేస్తున్నారు.

Verizon’s mmWave 5G network ఫాస్టెస్ట్ 5G స్పీడ్ కనెక్షన్లు కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే కొన్ని లొకేషన్లలో PCMag టెస్టింగ్ చేస్తోంది.

దేశవ్యాప్తంగా Verizon అందించే 5G నెట్ వర్క్‌లో 5G ఐకాన్‌తో 4G స్పీడ్ మాత్రమే అందిస్తోంది.

ఏదిఏమైనా ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్లలో లేటెస్ట్ ఐఫోన్ లైనప్ తక్కువ ధర నుంచి అత్యంత ఖరీదైన ఐఫోన్లను అందించనుంది.

ఇక ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 11ప్రో/ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది.

5G నెట్ వర్క్‌తో iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max లైనప్ ఎంట్రీ ఇస్తోంది.

కొత్త iPhone 12 మోడళ్లకు Upgrade అవుతున్నారా? :

2020 ఏడాదిలో ఆపిల్ 4 కొత్త ఐఫోన్లను మార్కెట్లోకి దించుతోంది.

ప్రతి ఐఫోన్ కేటగిరీలో నార్మల్ నుంచి ప్రో మోడల్ ఆకర్షణీయంగా ఉండనున్నాయి.

ఈ కొత్త ఐఫోన్లలో మిక్సింగ్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ధరలు మోడళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

iPhone SE :
4.7-inch 64GB: $399
4.7-inch 128GB: $449
4.7-inch 256GB: $549
Colors: White, Black, Red

iPhone XR :
6.1-inch 64GB: $499 (-$100 ధర తగ్గింపు)
6.1-inch 128GB: $549 (-$100 ధర తగ్గింపు)
Colors: White, Black, Blue, Yellow, Coral, Red

iPhone 11 :
6.1-inch 64GB: $599 (-$100 ధర తగ్గింపు)
6.1-inch 128GB: $649 (-$100 ధర తగ్గింపు)

6.1-inch 256GB: $749 (-$100 ధర తగ్గింపు)
Colors: White, Black, Green, Yellow, Purple, Red

iPhone 12 mini :
5.4-inch 64GB: $729 (రూ. 53,389)
5.4-inch 128GB: $779 (రూ. 57,051)
5.4-inch 256GB: $879 (రూ.64,374)
Colors: White, Black, Blue, Green, Red

iPhone 12 :
6.1-inch 64GB: $829 (రూ.60,713)
6.1-inch 128GB: $879 (రూ.64,374)
6.1-inch 256GB: $979 (రూ.71,698)
Colors: White, Black, Blue, Green, Red

iPhone 12 Pro :
6.1-inch 128GB: $999 (రూ. 73,163)
6.1-inch 256GB: $1,099 (రూ.80,486)
6.1-inch 512GB: $1,299 (రూ.95,134)
Colors: Graphite, Silver, Gold, Pacific Blue

iPhone 12 Pro Max :
6.7-inch 128GB: $1,099 (రూ.80,486)
6.7-inch 256GB: $1,199 (రూ.87,810)
6.7-inch 512GB: $1,399 (రూ.1,02457)
Colors: Graphite, Silver, Gold, Pacific Blue

ట్రెండింగ్ వార్తలు