iPhone 13 Series : 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కొత్త ఐఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ రాబోతోంది. వచ్చే సెప్టెంబర్ నెలలో లాంచ్ కానున్నట్టు రుమర్లు వస్తున్నాయి. వచ్చే ఐఫోన్ సిరీస్ విషయంలో ఆపిల్ అధికారిక ప్రకటన చేయలేదు.

iPhone 13 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ రాబోతోంది. వచ్చే సెప్టెంబర్ నెలలో లాంచ్ కానున్నట్టు రుమర్లు వస్తున్నాయి. వచ్చే ఐఫోన్ సిరీస్ విషయంలో ఆపిల్ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఈ ఐఫోన్ 13 సిరీస్ స్పెషిఫికేషన్లకు సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. iPhone 13 సిరీస్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానుంది. ప్రస్తుత iPhone 12 ఫోన్‌ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌కు అడ్వాన్స్ సెటప్‌తో 13 సిరీస్ రానుంది. 2019లో ఆపిల్ 18W USB-C అడాప్టర్‌తో iPhone 11, iPhone Pro Max ఫోన్లను ప్రవేశపెట్టింది. 2020లో ఆపిల్ అంతకంటే పవర్ ఫుల్ అడాప్టర్ తీసుకొచ్చింది.

అది కూడా 20W USB-Type అడాప్టర్ తీసుకొచ్చింది. రాబోయే ఐఫోన్ 13 సిరీస్ లో కూడా ఆపిల్ అప్ గ్రేడ్ చేస్తే.. USB Type-Cతో ఐఫోన్ యూజర్లకు ఫాస్ట్ ఛార్జింగ్ అనుభవాన్ని అందించనుంది. మార్కెట్లో ఇతర స్మార్ట్ ఫోన్ పోటీదారులు అందించే ఫోన్లన్నీ ఐఫోన్ల ఛార్జర్ల కంటే ఫాస్ట్ గా పనిచేస్తున్నాయి. ఆపిల్ అధికారిక వెబ్ సైట్లో ప్రస్తుతం ఫాస్ట్ ఛార్జింగ్ సేల్ 20W మాత్రమే ఆఫర్ చేస్తోంది. పాత 18W ఫాస్ట్ ఛార్జర్ స్పీడ్ తో పోలిస్తే కొంచె స్పీడ్ ఉంటుంది. అయినప్పటికీ ఈసారి ఈసారి 25W ఛార్జింగ్ పవర్ పెంచేసింది. అంటే.. కొత్త జనరేషన్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్లను యూజర్లు వేరుగా కొనుగోలు చేయాల్సి రావొచ్చు.

ఈ ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ నుంచి నాలుగు మోడల్స్ లాంచ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అందులో iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 13 mini మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 12 సిరీస్ మోడల్ మాదిరిగానే బాక్స్ డిజైన్ కనిపిస్తోంది. ప్రత్యేకించి ఐఫోన్ 13 సిరీస్ లో కెమెరా సెటప్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా ఉంది. రెండు కెమెరా సెన్సార్లతో రాబోతుందని టాక్..

ట్రెండింగ్ వార్తలు