iPhone 14 Plus Service Program for Rear Camera Issue
iPhone 14 Plus Service Program : ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. ఆపిల్ పాపులర్ ఐఫోన్ మోడల్స్‌లో ఒకటైన ఐఫోన్ 14 ప్లస్ మోడల్ కెమెరాను ఉచితంగా రిపేర్ చేస్తోంది. నివేదిక ప్రకారం.. ఆపిల్ బ్యాక్ కెమెరా ప్రివ్యూ సమస్యలు తలెత్తే ఐఫోన్ 14 ప్లస్ మోడళ్లకు ఉచితంగా రిపేరింగ్ సర్వీసును అందిస్తోంది.
ఈ సమస్య ముఖ్యంగా ఏప్రిల్ 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య తయారైన యూనిట్‌లపై ప్రభావితం చేస్తుంది. ఐఫోన్ 14 ప్లస్ మోడళ్లలో చాలా తక్కువ శాతం బ్యాక్ కెమెరాను ఉపయోగించిన సమయంలో ప్రివ్యూలను చూపించడంలో విఫలమవుతుందని ఆపిల్ పేర్కొంది. ఈ సమస్యతో ప్రభావితమైన కస్టమర్‌లు ఆపిల్ రిటైల్ స్టోర్, అధీకృత సర్వీస్ ప్రొవైడర్‌లు లేదా మెయిల్-ఇన్ సర్వీస్ ఆప్షన్ ద్వారా ఉచిత రిపేర్‌ను పొందవచ్చు.
మీరు అర్హులా కాదా? ఎలా చెక్ చేయాలంటే? :
ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ యూజర్లు ఆపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ వెబ్‌పేజీలో వారి క్రమ సంఖ్యను రిజిస్టర్ చేయడం ద్వారా వారి డివైజ్ అర్హతను చెక్ చేయవచ్చు. ఈ ఐఫోన్ కొనుగోలు తేదీ నుంచి 3 ఏళ్ల పాటు రిపేరింగ్ కవరేజ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌ను కవర్ చేస్తుంది. ఈ సర్వీసు కింద ఇతర ఐఫోన్ మోడల్‌లు ఏవీ కవర్ చేయబడవు. ఈ నిర్దిష్ట కెమెరా సమస్యకు సంబంధించిన రిపేర్ల కోసం గతంలో చెల్లించిన కస్టమర్‌లకు రీఫండ్ చేస్తుంది.
అలాంటి కస్టమర్లు డబ్బును వాపస్ పొందడానికి ఆపిల్ కస్టమర్ సెంటర్ సంప్రదించవచ్చు. అయితే, కంపెనీ రిపేరింగ్ ఖర్చులను కొనుగోలు చేసిన ప్రాంతానికి పరిమితం చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఐఫోన్ 14 ప్లస్ కోసం ప్రామాణిక వారంటీ కవరేజీని పొడిగించదని గమనించాలి. 2021 తర్వాత ఆపిల్ ఫస్ట్ ఐఫోన్ సర్వీస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇంతకుముందు, కంపెనీ కొన్ని ఐఫోన్ 12 మోడళ్లలో ఇయర్‌పీస్ స్పీకర్ సమస్యలను పరిష్కరించింది. రిపేర్ సర్వీసును పొందే ముందు తమ డివైజ్ ఐక్లౌడ్‌లో లేదా కంప్యూటర్‌లో బ్యాకప్ చేసుకోవాలని ఆపిల్ యూజర్లకు సూచించింది.
ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్లు :
ఐఫోన్ 14 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ ఎ15 బయోనిక్ చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. 12ఎంపీ వైడ్ యాంగిల్, 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 12ఎంపీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నుంచి రక్షించేందుకు ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది.
సర్వీస్ ప్రోగ్రామ్ అర్హత చెక్ చేయండిలా :
ఐఫోన్ 14 ప్లస్‌లో సీరియల్ నంబర్‌ను గుర్తించేందుకు వినియోగదారులు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. General> About ట్యాప్ చేయండి. ఈ స్క్రీన్‌పై సీరియల్ నంబర్‌పై కాసేపు నొక్కి ఉంచడం ద్వారా కాపీ షార్ట్‌కట్ డిస్‌ప్లే అవుతుంది. ఐఫోన్ 14 ప్లస్ సర్వీస్ ప్రోగ్రామ్ కోసం ఆపిల్ సపోర్టు పేజీలోని ఫీల్డ్‌లో టెక్స్ట్ పేస్ట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
విరిగిన బ్యాక్ గ్లాస్ ప్యానెల్ వంటి బ్యాక్ కెమెరా సర్వీసును నిరోధించే నష్టంతో ఐఫోన్ 14 ప్లస్ యూనిట్‌లను కలిగిన కొంతమంది కస్టమర్‌లు ఆ సమస్యలను ముందుగా పరిష్కరించాల్సి ఉంటుందని ఆపిల్ సపోర్టు పేజీ పేర్కొంది. ఉచిత సర్వీస్ ప్రోగ్రామ్‌లా కాకుండా ఈ అదనపు రిపేరింగ్ కోసం కస్టమర్‌లకు ఛార్జీ విధించనున్నట్లు ఆపిల్ తెలిపింది.
Read Also : iPhone SE 4 Launch : ఆపిల్ ఐఫోన్ SE 4 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?