iPhone 15 Pro Sale : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15ప్రోపై ఏకంగా రూ.20వేలు డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 15 Pro Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అన్ని ప్లస్ సబ్‌స్క్రైబర్‌లకు సెప్టెంబర్ 26న అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత అందరికీ ఒక రోజు తర్వాత (సెప్టెంబర్ 27) సేల్ ప్రారంభం కానుంది.

iPhone 15 Pro gets Rs 20K discount_ Know how to avail this deal

iPhone 15 Pro Sale : ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ఐఫోన్ 16 సిరీస్ వచ్చిన తర్వాత గత ఐఫోన్ల మోడల్స్ భారీ ధర తగ్గింపు పొందాయి. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15 ప్రో ధర మరింత తగ్గింది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో సహా అన్ని లేటెస్ట్ ఆపిల్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది.

Read Also : Apple iPhone 17 Leak : ఆపిల్ ఐఫోన్ 17 ఫీచర్లు లీక్.. బిగ్ డిస్‌ప్లే, మరెన్నో అప్‌గ్రేడ్ ఆప్షన్లు ఉండొచ్చు..!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ద్వారా ఈ ఐఫోన్ 15ప్రో ఫీచర్‌లతో తక్కువ ధరకే పొందవచ్చు. ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఇటీవల ఐఫోన్ 15 ప్రోను రూ. 89,999 ధరకు విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఆసక్తికరంగా, ఈసారి, ఫ్లిప్‌కార్ట్ ఇదే ఐఫోన్ ధరను మరింత తగ్గింపు ధరకు అందించనుంది.

ప్లస్ మెంబర్లకు ముందుగానే సేల్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అన్ని ప్లస్ సబ్‌స్క్రైబర్‌లకు సెప్టెంబర్ 26న అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత అందరికీ ఒక రోజు తర్వాత (సెప్టెంబర్ 27) సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 15 సిరీస్‌లోని ప్రతి మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపులను అందిస్తుంది. ఐఫోన్ ప్రోతో పాటు, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌పై కూడా భారీ తగ్గింపును కూడా ఆవిష్కరించింది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ధర రూ.1,39,999 నుంచి రూ.1,09,900కి తగ్గుతుంది.

ఈ డీల్‌ను ఎలా పొందాలంటే? :
ఐఫోన్ 15 ప్రో సేల్ ధర రూ.1,19,999 నుంచి రూ.99,999కి తగ్గిందని ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. అంటే.. రూ.10వేల తగ్గింపు అందరికీ వర్తిస్తుంది. అయితే, మరో రూ. 10వేలతగ్గింపుతో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ విఐపీ కస్టమర్‌లు అదనంగా రూ. 2వేలు ఎక్స్ఛేంజ్ ఆఫ్ పొందవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ రిలీజ్ తర్వాత ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మాక్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 15 ప్రో ఎందుకంటే? :
ఐఫోన్ 15 ప్రో గ్రేడ్ 5 టైటానియం బాడీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను మరింత తేలికగా చేస్తుంది. ఐఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. హుడ్ కింద, సరికొత్త ఎ17 ప్రో ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. మెరుగైన పర్ఫార్మెన్స్ కోసం చిప్ 6-కోర్ డిజైన్‌తో పెద్ద జీపీయూని కూడా కలిగి ఉంది. ఐఫోన్ 15 ప్రో హై రిజల్యూషన్ ఫోటోలకు 48ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 15ప్రోలో 3ఎక్స్ టెలిఫోటో కెమెరాతో కూడా వస్తుంది. అంతేకాకుండా, ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్‌ సపోర్టు కలిగి ఉన్నాయి.

Read Also : Spam Calls Block : మీ ఫోన్ నెంబర్‌కు స్పామ్ కాల్స్ వస్తున్నాయా? బ్లాక్ చేయాలంటే వెంటనే ఇలా చేయండి.. అన్ని నెట్‌వర్క్‌లకు ఒకటే ఆప్షన్..!