iPhone 15 Pro Action Button : ఐఓఎస్ 18 సపోర్టు.. ఆపిల్ ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌లో మరిన్ని ఫీచర్లు..!

iPhone 15 Pro Action Button : ఇటీవలే జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ( WWDC 2024)లో ప్రవేశపెట్టిన ఐఓఎస్18, ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌కు మరింత యాక్టివిటీని తీసుకువస్తోందని ఒక నివేదిక తెలిపింది. 

iPhone 15 Pro Action Button : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ( WWDC 2024)లో ప్రవేశపెట్టిన ఐఓఎస్18, ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌కు మరింత యాక్టివిటీని తీసుకువస్తోందని ఒక నివేదిక తెలిపింది.

Read Also : Oppo F27 Pro Plus 5G : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఒప్పో F27 ప్రో ప్లస్ 5జీ.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

కాలిక్యులేటర్, స్టాప్‌వాచ్, హోమ్, రిమోట్, మరిన్నింటితో సహా అదనపు కస్టమైజడ్ చర్యలకు ఆపిల్ త్వరిత యాక్సస్ అందిస్తుంది. ప్రస్తుతం, వినియోగదారులు బటన్‌కు 9 ప్రీసెట్ ఆప్షన్లను కేటాయించవచ్చు, అయితే, త్వరలో డార్క్ మోడ్‌ను టోగుల్ చేయడం, హోమ్ యాప్ ద్వారా డివైజ్‌లను కంట్రోల్ చేయడం లేదా క్యాష్‌‌‌కు ట్యాప్ చేయడం వంటి మరిన్ని యాక్టివిటీలను అందించగలదు.

యాక్షన్ బటన్‌కు కొత్త ఫీచర్లు :
నివేదిక ప్రకారం.. ఐఓఎస్ 18 డెవలపర్ బీటా 1తో యాక్షన్ బటన్‌కు ఆపిల్ 14 కొత్త కస్టమైజడ్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, ఐఓఎస్ 17 వాయిస్ మెమో, కెమెరా, ఫోకస్, సైలెంట్ మోడ్, టార్చ్, ట్రాన్స్‌లేట్, మాగ్నిఫైయర్, యాక్సస్ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్లతో పాటు, వినియోగదారులు ఏమీ చేయని విధంగా కూడా సెట్ చేయవచ్చు. ఐఫోన్ సెట్టింగ్‌లలో కొత్త ‘కంట్రోల్స్’ ఆప్షన్ ద్వారా ఇప్పటికే ఉన్న ఈ యాక్షన్స్ విస్తరించడానికి ఐఓఎస్ 18 కొత్త ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది.

  • కాలిక్యులేటర్
  • అలారం
  • స్టాప్‌వాచ్
  • హోమ్
  • టైమర్
  • వాలెట్
  • డార్క్ మోడ్
  • స్కాన్ కోడ్
  • ఫ్లైట్ మోడ్
  • సెల్యులర్ డేటా
  • పర్సనల్ హాట్ స్పాట్
  • రిమోట్
  • ట్యాప్ టూ క్యాష్
  • పింగ్ మై వాచ్

2023లో ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ లాంచ్‌తో యాక్షన్ బటన్‌ని ఆపిల్ ప్రవేశపెట్టింది. వాల్యూమ్ కంట్రోలింగ్ పైన ఉన్న మ్యూట్ స్విచ్‌ని రిప్లేస్ చేసింది. కానీ, ఐఫోన్ 15 మోడల్‌లలో అందుబాటులో లేదు.

కంట్రోల్ సెంటర్ అప్‌డేట్స్ :
ఐఫోన్ 16 యాక్షన్ బటన్‌కు ఫంక్షనాలిటీలతో పాటు, ఆపిల్ కంట్రోల్ సెంటర్ కంట్రోలింగ్ మరిన్ని ఆప్షన్లను వెల్లడించింది. (WWDC)లో iOS 18 యూజర్లను థర్డ్-పార్టీ అప్లికేషన్‌లలో కెమెరా ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. “LockedCameraCapture” పేరుతో డెవలపర్‌ల కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఈ ఫీచర్ అందిస్తుంది.

ఆపిల్ ప్రకారం.. డెవలపర్‌లు యాప్ కెమెరాను లాక్ చేసినప్పుడు కంటెంట్‌ను త్వరగా క్యాప్చర్ చేందుకు యూజర్లను అనుమతిస్తుంది. దీనికి ఎక్స్‌టెన్షన్ క్రియేట్ చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఐఓఎస్18తో వినియోగదారులు మరిన్ని కంట్రోలింగ్, టోగుల్‌లతో స్వైప్ చేయగలరు. కొత్త కంట్రోలింగ్ గ్యాలరీని కంట్రోలింగ్ సెంటర్‌కు కనెన్ట్ చేసే ఆప్షన్ల పూర్తి జాబితాను డిస్‌ప్లే చేస్తుంది.

Read Also : Best Mobile Phones 2024 : ఈ నెలలో రూ.35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు