iPhone 16 Pro Colour Options Tipped; Leaked Case Hints at Location of Capture Button
iPhone 16 Pro Leak : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు ఇంట్రెస్టింగ్ న్యూస్.. రాబోయే ఐఫోన్ 16 ప్రో గురించి మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2024 మధ్యలో ఈ ఐఫోన్ హ్యాండ్సెట్ లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఐఫోన్ 16ప్రో మోడల్ మొత్తం 4 కలర్ ఆప్షన్లలో రావచ్చు.
గత ఏడాదిలో ప్రవేశపెట్టిన రెండు కలర్ ఆప్షన్లకు మరో రెండు కలర్లను కంపెనీ చేర్చనుంది. ఆపిల్ మొత్తంగా 4 కలర్ ఆప్షన్లలో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ బాడీ స్టెయిన్లెస్ స్టీల్‌కు బదులుగా టైటానియంను తీసుకొచ్చింది. అదేవిధంగా, ఐఫోన్ 16 ప్రో కేసుగా కనిపించే లీక్ ఫొటోలో స్మార్ట్‌ఫోన్‌లో కొత్త క్యాప్చర్ బటన్ ఎక్కడ ఉంటుందో చెప్పకనే చెప్పేసింది.
ఐఫోన్ 16 ప్రో కేసు ఫొటో లీక్ :
టిప్‌స్టర్ లీక్ వివరాల ప్రకారం.. ఐఫోన్ 16 ప్రో మోడల్ గ్రే, రోజ్, స్పేస్ బ్లాక్, వైట్, కలర్‌వేస్‌లో వస్తుంది. అంతేకాదు.. గ్రే, వైట్ కలర్స్ ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లోని ఆప్షన్ల మాదిరిగానే కనిపిస్తున్నప్పటికీ, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లు వరుసగా స్పేస్ బ్లాక్, రోజ్ కలర్స్‌తో వచ్చేలా కనిపిస్తోంది.
మరో లీక్ ప్రకారం.. ఐఫోన్ 16 ప్రో కేసు ఫొటోను ఆపిల్ క్యాప్చర్ బటన్ హ్యాండ్‌సెట్‌లో ఎక్కడ ఉండవచ్చో సూచించినట్లు కనిపిస్తుంది. ఐఫోన్ 15 ప్రో మోడళ్లతో ప్రోగ్రామబుల్ యాక్షన్ బటన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆపిల్ తర్వాత జనరేషన్ మోడల్ ఐఫోన్లలో కూడా ఇదే తరహా యాక్షన్ బటన్ అందించనుంది. కెమెరాతో ఫొటోలు లేదా వీడియోలను వేగంగా క్యాప్చర్ చేయడానికి ఉపయోగించే ఈ కొత్త బటన్‌ను ఆపిల్ తీసుకురానుంది.
2024 చివరిలో ఐఫోన్ 16ప్రో లాంచ్ అయ్యే ఛాన్స్ :
క్యాప్చర్ బటన్ ఫోన్ కుడి వైపున పవర్ బటన్ కింద ఉండవచ్చని లీక్ ఫొటో సూచిస్తుంది. ఈ నెల ప్రారంభంలో ఆన్లైన్లో కనిపించిన ప్రో మోడల్‌ల లీకైన రెండర్ల మాదిరిగానే ఉంటుంది. ఐఫోన్ కేస్ పవర్ బటన్‌ను కవర్ చేసేలా ఉంది. అయితే, పుకార్లలో క్యాప్చర్ బటన్ లొకేషన్ కూడా రివీల్ అయింది.
ఐఫోన్ కటౌట్‌ను (mmWave) 5జీ యాంటెన్నా వంటి ఇతర భాగాలను ఉంచడానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ ఏడాది చివరిలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో 3ఎన్ఎమ్ ఎ18 ప్రో చిప్‌తో మెరుగైన న్యూరల్ ఇంజిన్ పనితీరు, టాప్-ఆఫ్-లైన్ మోడల్‌తో వస్తుందని అంచనా. భారీ పెద్ద బ్యాటరీ కూడా ఉండవచ్చు. ఇటీవలి నివేదికల ప్రకారం.. ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో మరిన్ని ఆన్-డివైస్ ఏఐ ఫీచర్లకు సపోర్ట్ అందించనుంది.