iPhone 17: ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ ధర ఇండియాలో ఎంత ఉంటుంది? దాని కెమెరా, డిజైన్ ఎలా ఉన్నాయి? కెవ్వుకేక..

ఆపిల్ టైటానియం-అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

iPhone 17: ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ ధర ఇండియాలో ఎంత ఉంటుంది? దాని కెమెరా, డిజైన్ ఎలా ఉన్నాయి? కెవ్వుకేక..

Updated On : February 26, 2025 / 2:09 PM IST

ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఇంకా విడుదల కాకముందే దానికి సంబంధించిన లీకులు ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి. ఐఫోన్ 17 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుందని చాలా కాలంగా అంచనాలు ఉన్నాయి.

ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మాక్స్ ఆ నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ని ఫోన్లు డిజైన్లలో అనేక మార్పులతో వస్తున్నాయి. తాజాగా, ఐఫోన్ 17 ఎయిర్ ఫీచర్ల గురించి పలు లీకులు బయటకు వచ్చాయి. చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 ఎయిర్ ఫీచర్ల గురించి చూద్దాం.

Also Read: గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఫండ్స్ రిలీజ్.. ఈ జిల్లాల్లో లబ్ధిదారులకు అకౌంట్లో రూ.6వేలు పడ్డాయ్..

అల్ట్రా-తిన్‌ డిజైన్
భారత్‌లో ఐఫోన్ 17 ఎయిర్ ధర సుమారు రూ.89,900గా ఉంటుందని లీకుల ద్వారా తెలుస్తోంది. ఐఫోన్ 17 ఎయిర్‌కు సంబంధించిన ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి దాని అల్ట్రా-తిన్‌ డిజైన్. ఇది 5.5 మిల్లీ మీటర్లు- 6.25 మిల్లీ మీటర్ల మధ్య మందంతో రానుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన ఏ ఐఫోన్‌ కూడా లేనంత సన్నగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఆపిల్ టైటానియం-అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఫోన్ 17 ఎయిర్ స్క్రీన్ విజిబిలిటీని పెంచడానికి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో వస్తుందని తెలుస్తోంది.

ఆపిల్ ఐఫోన్‌ 17 ఎయిర్‌తో పాటు అన్ని ఐఫోన్ 17 మోడళ్లకు ప్రమోషన్ 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ టెక్నాలజీని తీసుకువస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, స్క్రీన్ ఎల్‌టీపీవో టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 17 ఎయిర్.. ఆపిల్ ఏ19 చిప్‌సెట్ తో వస్తుందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. ఈ చిప్ గురించి వివరాలు అంతగా బయటకు రాలేదు. ఇది ఇంతకుముందున్న మోడళ్లతో పోలిస్తే మరింత వేగంగా, ఎనర్జీ ఎఫిషియన్సీతో వస్తోంది. ఐఫోన్ 17 ఎయిర్ ఒకే 48 ఎంపీ బ్యాక్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం, ఐఫోన్ 17 ఎయిర్ 24 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది.