iPhone 17 Air : అత్యంత సన్నని ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేస్తోందోచ్.. స్పెషిఫికేషన్లు, రిలీజ్ డేట్, భారత్ ధరపై భారీ అంచనాలివే..!

iPhone 17 Air : ఆపిల్ త్వరలో కొత్త ఐఫోన్ 17 ఎయిర్‌ను ఆవిష్కరించనుంది. డిజైన్ మార్పులు, స్పెషిఫికేషన్లు, స్పెషల్ కలర్ ఆప్షన్లపై అంచనాలివే..

iPhone 17 Air

iPhone 17 Air : ఆపిల్ అభిమానుల గుడ్ న్యూస్.. అతి త్వరలో ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేస్తోంది. టెక్ దిగ్గజం ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ మోడల్స్ లాంచ్ చేసేందుకు (iPhone 17 Air) రెడీ అవుతోంది. ఈ ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. వచ్చే సెప్టెంబర్ 2025 నాటికి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త లైనప్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ సహా అత్యంత ఎదురుచూస్తున్న కొత్త మోడల్ ఐఫోన్ 17 ఎయిర్ ఉంటుంది. ఈ కొత్త ఐఫోన్ వేరియంట్ 6 మి.మీ కన్నా తక్కువ మందంతో అల్ట్రా-సన్నని డిజైన్‌తో రానుంది.

ఈ కొత్త ఐఫోన్ మోడల్ శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వంటి పోటీదారులకు దీటుగా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నాు. రాబోయే ఐఫోన్ 17 ఎయిర్ గురించి మరిన్ని వివరాలను ఓసారి తెలుసుకుందాం..

కలర్ ఆప్షన్లపై పుకార్లు :
నివేదికల ప్రకారం.. రాబోయే ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ మొత్తం 4 వేర్వేరు కలర్ ఆప్షన్లలో రానుంది. ఇందులో క్లాసిక్ బ్లాక్, సిల్వర్ ఉన్నాయి. అంతేకాదు.. లైట్ గోల్డ్, లైట్ బ్లూ అనే మరో రెండు తేలికైన కలర్ టోన్లు కూడా ఉన్నాయి. గత ఆపిల్ బ్లూ కలర్ ఆప్షన్లకు చాలా భిన్నంగా ఉంటుందని అంచనా. మ్యాక్‌బుక్ ఎయిర్ M4లో కనిపించే స్కై బ్లూను పోలి ఉండవచ్చు. గత నివేదికలను పరిశీలిస్తే.. గ్రీన్ లేదా పర్పల్ కలర్ ఆప్షన్లు ఉండొచ్చు.

Read Also : Best Smartphone Deals : అమెజాన్‌‌లో రూ.10వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. రెడ్‌మి నుంచి శాంసంగ్ వరకు ఏది కొంటారో మీ ఇష్టం..!

డిజైన్, స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల OLED స్క్రీన్‌తో రావచ్చు. ఈ అప్‌గ్రేడ్ స్మూత్ స్క్రోలింగ్, అట్రాక్టివ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ చూసేందుకు చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. లీక్‌ల ప్రకారం పరిశీలిస్తే.. ఐఫోన్ 17 ఎయిర్ బాడీ మందం కేవలం 5.5 మిమీ, బరువు 145 గ్రాములకు దగ్గరగా ఉంటుంది.

అదేగాని నిజమైతే.. ఆపిల్ అందించే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఐఫోన్ 17 ఎయిర్ హుడ్ కింద ఆపిల్ A19 చిప్‌తో 8GB ర్యామ్ కలిగి ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 2800mAh వరకు ఉండొచ్చు.

కెమెరాల విషయానికొస్తే.. ఈ ఐఫోన్ సింగిల్ రియర్ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. ఆపిల్ ఫ్యూజన్ కెమెరా టెక్నాలజీతో రావచ్చు. ఈ ఫీచర్ 2x ఆప్టికల్-క్వాలిటీ జూమ్‌ కలిగి ఉండొచ్చు. తేలికైన ఫ్రేమ్ ఉన్నప్పటికీ ఫొటోలను అద్భుతంగా క్యాప్చర్ చేయగలదు.

భారత్, యూఎస్, యూఎఇలో ధర (అంచనా) :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ ధర దాదాపు రూ. 89,900 ఉండొచ్చు. యునైటెడ్ స్టేట్స్‌ (US)లో ఐఫోన్ మోడల్ ధర 899 డాలర్లు, దుబాయ్‌లో AED 3,799 ఉంటుందని అంచనా. వచ్చే సెప్టెంబర్ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లోని మిగిలిన ఫోన్లతో పాటు ఈ కొత్త ఐఫోన్‌ 17 ఎయిర్ రివీల్ చేయొచ్చు. భారత్ సహా ఇతర దేశాల్లోని ఆపిల్ ఔత్సాహికుల కోసం ఐఫోన్ 17 సీరిస్ అధికారిక లాంచ్ తర్వాత అందుబాటులోకి రావచ్చు.