Best Smartphone Deals : అమెజాన్‌లో రూ.10వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. రెడ్‌మి నుంచి శాంసంగ్ వరకు ఏది కొంటారో మీ ఇష్టం..!
Best Smartphone Deals : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ. 10వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఓసారి లుక్కేయండి..

Best Smartphone Deals
Best Smartphone Deals : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ సందర్భంగా బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అనేక బ్రాండ్ల (Best Smartphone Deals) స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ల కోసం చూసే యూజర్లకు ఇదే సరైన సమయం.
కెమెరా ఫీచర్ల నుంచి బ్యాటరీ కెపాసిటీ వరకు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ అదిరే డీల్స్ అందిస్తోంది. ఈ సేల్ సమయంలో రూ. 10వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.
రెడ్‌మి A4 :
రెడ్‌మి A4 ఫోన్ 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో G36 ప్రాసెసర్, రోజంతా ఛార్జింగ్ అందించే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఆధారంగా MIUIపై రన్ అవుతుంది. 8MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుంది. సాధారణ యూజర్లకు ఈ ఫోన్ బెస్ట్ మోడల్. అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా రెడ్‌మి A4 ఫోన్ రూ.7,999 ధరకు లభిస్తుంది.
లావా బోల్డ్ N1 ప్రో :
లావా బోల్డ్ N1 ప్రో ఫోన్ 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లే, యూనిసోక్ T616 చిప్‌సెట్, 64GB స్టోరేజ్‌తో 4GB ర్యామ్ కలిగి ఉంది. 13MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్‌తో రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా లావా బోల్డ్ N1 ప్రో రూ. 6,799 ధరకు అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M06 :
శాంసంగ్ గెలాక్సీ M06 ఫోన్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 6.5-అంగుళాల PLS LCD డిస్‌ప్లే కలిగి ఉంది. 50MP డ్యూయల్-కెమెరా సెటప్, లాంగ్ లైఫ్ 5000mAh బ్యాటరీ, శాంసంగ్ క్లీన్, స్టేబుల్ వన్ యూఐ కోర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ M06 ధర రూ. 9,799కు పొందవచ్చు.