Apple iPhone 17 Series : భారత్‌లో ఐఫోన్ 17 ధరల మోత.. ఈ మోడల్స్ కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందేనా?

Apple iPhone 17 Series : ఆపిల్ కొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్, ఐఫోన్ డ్యూయోలను లాంచ్ చేసిన తర్వాత భారత మార్కెట్లో ఐఫోన్ 17 మోడల్ ధర భారీగా రూ. 17వేలు పెరిగింది. పూర్తి వివరాలివే..

  • Published on- September 11, 2026 / 05:57 PM IST

Apple iPhone 17 Series

  • ఆపిల్ కొత్త ఐఫోన్ 18 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్
  • భారత మార్కెట్లో ఒక్కసారిగా భారీగా పెరిగిన ఐఫోన్లు
  • ఐఫోన్ 17, ఐఫోన్ 17e, ఐఫోన్ 17 సిరీస్ ధరల పెంపు

Apple iPhone 17 Series : ఐఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. భారత మార్కెట్లో కొత్త ఐఫోన్లు కొనడం కష్టమే.. 2025లో లాంచ్ చేసిన ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్‌తో సహా భారత మార్కెట్లో అనేక ఐఫోన్ మోడళ్ల ధరలను ఆపిల్ భారీగా పెంచింది. ఆపిల్ సరికొత్త జనరేషన్ ఐఫోన్‌లను ఆవిష్కరించిన ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్ జరిగిన వెంటనే ఈ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది.

ప్రస్తుతం ఐఫోన్ మోడళ్లు కొత్త ధరలతో ఇప్పుడు భారతీయ మార్కెట్లో ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో కనిపిస్తున్నాయి. అందుబాటులో ఉన్న అన్ని స్టోరేజ్ (Apple iPhone 17 Series) వేరియంట్‌లకు వర్తిస్తాయి. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో పాటు, మరింత సరసమైన ఐఫోన్ 17e ధరను కూడా పెంచింది. అదే సమయంలో గత జనరేషన్ ఐఫోన్ 16 ధర కూడా పెరిగింది.

భారత మార్కెట్లో ఐఫోన్ ధరల పెంపు :
అందరూ ఊహించినట్లుగానే.. ఐఫోన్ 17 ధర ఇప్పుడు రూ. 82,900 నుంచి రూ. 99,900కు పెరిగింది. అలాగే, 256GB స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 1,19,900 నుంచి ఇప్పుడు రూ. 149,900కు పెరిగింది.

ఈ ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో పాటు ఆపిల్ సరసమైన ఐఫోన్ 17e ధర కూడా రూ. 79,900కు పెరిగింది. మరోవైపు, ఐఫోన్ 16 ధర కూడా పెరిగింది. తద్వారా ధర ఇప్పుడు రూ. 89,900కు పెరిగింది. వివిధ స్టోరేజ్ వేరియంట్ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఐఫోన్ 17 ధర పెంపు :
256GB : రూ. 99,900 (రూ. 82,900 నుంచి) రూ. 17వేలు పెంపు
512GB : రూ. 1,24,900 (రూ. 1,02,900 నుంచి పెంపు), రూ. 22వేలు పెంపు

ఐఫోన్ ఎయిర్ ధర పెంపు :
256GB : రూ. 1,49,900 (గతంలో రూ. 1,19,900), రూ. 30వేల పెరుగుదల
512GB : రూ. 1,74,900 (గతంలో రూ. 1,39,900), రూ. 35వేలు పెంపు
1TB : రూ. 2,24,900 (రూ. 1,59,900 నుంచి పెంపు), రూ. 65వేలు అదనం

Read Also : Apple iPhone Air Price : ఇదే బెస్ట్ టైమ్ మావా.. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ఇంత తక్కువకు మళ్లీ దొరకదు.. అమెజాన్‌లో జస్ట్..!

ఐఫోన్ 16 (256GB) ధర పెంపు :
మొత్తంగా రూ. 89,900కి పెరిగింది. పాత ధర రూ. 79,900 ఉండగా అదనంగా రూ. 10వేలు పెరిగింది.

ఐఫోన్ 17e ధర పెంపు :
256GB : రూ. 79,900 (అసలు ధర రూ. 64,900) అంటే.. రూ. 15వేలు అదనం
512GB : రూ. 1,04,900 (రూ. 84,900 నుంచి పెంపు ), రూ. 20వేలు పెరుగుదల

ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధర పెంపు :
పాత జనరేషన్ మోడళ్లతో పోలిస్తే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో , ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్ల ధరలను భారీగా పెంచింది. ఐఫోన్ 17 ప్రో , ప్రో మాక్స్ బేస్ వేరియంట్ ధరలు వరుసగా రూ. 1,34,900, రూ. 1,49,900గా ఉన్నాయి.

ఇప్పుడు, ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ బేస్ వేరియంట్ స్టోరేజ్ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 1,64,900, రూ. 1,79,900గా ఉంది. ఈ కొత్త జనరేషన్ మోడళ్ల ధరలలో భారీగా రూ. 30వేలు పెంపు కనిపిస్తోంది. మరోవైపు, ఆపిల్ కొత్త ఫోల్డబుల్ ఐఫోన్, ఐఫోన్ డ్యూయో, రూ. 2,99,900 ధరకు లాంచ్ కాగా హై స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 4,49,900 వరకు ఉంటుంది.