iPhone 17 Pro Max: యాహూ.. మునుపెన్నడూ చూడని విధంగా ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిస్‌ప్లే.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది! 

ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిస్‌ప్లే గురించి కీలక విషయాలు బయటకొచ్చాయి.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిస్‌ప్లేలో భారీ అప్‌గ్రేడ్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కెమెరా మాడ్యూల్, బిల్డ్‌తో ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను యూజర్ల ముందుకు తీసుకురావడానికి ఆపిల్ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

డిజైన్‌ అప్‌గ్రేడ్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్‌గా డిస్‌ప్లేను మెరుగుపరుస్తున్నారని లీక్‌ల ద్వారా తెలిసింది. హైటాంగ్ ఇంటర్నేషనల్ టెక్ రీసెర్చ్ విశ్లేషకుడు జెఫ్ పు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో మోడళ్లలో డైనమిక్ ఐస్‌లాండ్‌ ఇంతకు ముందున్న ఐఫోన్లకు ఉన్నదాని కంటే చిన్నగా ఉంటుంది.

డైనమిక్ ఐస్‌లాండ్‌ అంటే ఐఫోన్ స్క్రీన్ పైభాగంలో ఉన్న పిల్ ఆకారపు ప్రాంతం. ఇది ఫ్రంట్‌ కెమెరా, ఫేస్ ఐడీ సెన్సార్లతో ఉంటుంది. అయితే, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో మోడళ్లలో డైనమిక్ ఐస్‌లాండ్‌ ఇంతకు ముందున్న ఐఫోన్లకు ఉన్నదాని కంటే చిన్నగా ఉంటుందన్న అంచనాలను మరికొంత మంది విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.

ఎందుకంటే ఈ కొత్త డిస్‌ప్లే టెక్నాలజీ 2026 వరకు అందుబాటులోకి రాదని వారు భావిస్తున్నారు. అంతేగాక, ఐఫోన్‌ 17 సిరీస్‌లోని అన్ని మోడళ్లు ఒకేరకం డైనమిక్‌ ఐస్‌లాండ్‌తో వస్తాయని చెబుతున్నారు.

ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ డిస్‌ప్లే ఎలా ఉంటుందన్న దానిపై మరిన్ని లీక్‌లు కూడా వస్తున్నాయి. ఆపిల్‌ కంపెనీకి ఐఫోన్‌ డిస్‌ ప్లేకు కొత్త మెటలెన్స్ టెక్నాలజీని అనుసంధానించడానికి ప్రయత్నాలు చేస్తోందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి.

Also Read: మరో సంచలనం.. మరో 2 విమానాల్లో భారతీయులను వెళ్లగొట్టేస్తున్న అమెరికా

ఆ ప్రయత్నాల్లో ఆపిల్‌ కంపెనీ సఫలమైతే డైనమిక్ ఐస్‌లాండ్‌ సైజుని తగ్గించడానికి వీలు అవుతుంది. ఈ టెక్నాలజీని అన్ని ఐఫోన్ 17 మోడళ్లలో వాడతారని ముందుగా అందరూ భావించారు. అయితే, ఈ డిస్‌ప్లే అప్‌గ్రేడ్ కేవలం ఐఫోన్ 17 ప్రో మాక్స్‌కు మాత్రమే రావచ్చని తెలుస్తోంది.

ఇది డైనమిక్ ఐస్‌లాండ్‌ సైజుని తగ్గిస్తుంది. వీబో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్‌కూడా ఇదే విషయాన్ని తెలుపుతోంది. ఇప్పటికే చాలా సార్లు ఆపిల్ కెమెరా అప్‌గ్రేడ్లను ప్రత్యేకంగా ప్రో మాక్స్‌లోనే ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్రస్తుతం వచ్చిన లీక్‌ నిజమైతే ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఈ సిరీస్‌లోని ఇతర మోడళ్లకు కాస్త భిన్నంగా కనపడుతుంది.

ఐప్యాడ్ ప్రో, ఫోల్డబుల్ ఐప్యాడ్ కూడా మెటలెన్స్ టెక్నాలజీతో వస్తాయని టిప్‌స్టర్ వెల్లడించింది. అయినప్పటికీ వాటిలో డైనమిక్ ఐస్‌లాండ్‌ లేదు. తిన్నర్ బెజెల్స్‌తో అవి రావచ్చు.

కాగా, ఐఫోన్ 17 ప్రో మాక్స్ గ్లాస్, అల్యూమినియం బిల్డ్‌తో పాటు కొత్త కెమెరా మాడ్యూల్‌తో న్యూ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ జూమింగ్ సామర్థ్యాలతో అప్‌గ్రేడ్ చేసిన 48 ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో వస్తుందని చెప్పొచ్చు. ఇది కొత్త 24ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతోనూ రావచ్చు. ఐఫోన్ 17 ప్రో మాక్స్ అప్‌గ్రేడ్ చేసిన 12 జీబీ ర్యామ్‌తో, ఏ19 ప్రో చిప్ తో వస్తుందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది.