Indian immigrants: మరో సంచలనం.. మరో 2 విమానాల్లో భారతీయులను వెళ్లగొట్టేస్తున్న అమెరికా
ఇప్పటికే ఓ విమానం అమెరికా నుంచి వచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా అక్కడి అధికారులు ఇప్పటికే తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయుల్లో కొందరిని విమానంలో సొంత దేశానికి పంపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అటువంటి మరో రెండు విమానాలు భారత్ వస్తున్నాయి. ఫిబ్రవరి 15-16 తేదీల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అవి ల్యాండ్ అవుతాయి.
సెకండ్ బ్యాచ్‌లో 199 మంది అక్రమ వలసదారులు అమెరికా విమానంలో ఫిబ్రవరి 15న రానున్నారు. ఈ విమానం శనివారం రాత్రి 10 గంటలకు విమానాశ్రయానికి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ 119 మందిలో పంజాబ్‌కు చెందిన వ్యక్తులు 67 మంది, హరియాణాకు చెందిన 33, గుజరాత్‌కు చెందిన ఎనిమిది మంది, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
Also Read: గోల్డ్ లోన్ పెడదాం అని మీ మనసులో రాగానే.. ఫస్ట్ ఈ కింద లిస్ట్ చెక్ చేసుకోండి.. ఆ తర్వాత..
మూడో బ్యాచ్‌లో వస్తున్న మరో అమెరికా విమానం ఫిబ్రవరి 16న భారత్‌లో ల్యాండ్ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన కొన్ని గంటల తర్వాత వలసదారులకు సంబంధించిన మరో రెండు విమానాల వార్త రావడం గమనార్హం.
అక్రమ వలసలపై మోదీ కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విసయం తెలిసిందే. ఏ దేశానికైనా సరే అక్రమ వలసలు అనేది సమస్యేనని అన్నారు. ఏ దేశంలోకైనా అక్రమంగా వచ్చి, అక్కడే ఉండిపోతామంటే కుదరదని తెలిపారు.
చట్టవిరుద్ధంగా ఇతర దేశాల్లోకి అడుగుపెట్టిన వారికి ఆయా దేశాల్లో ఉండే హక్కు ఉండదని చెప్పారు. ఇది అందరికీ వర్తిస్తుందని అన్నారు. అమెరికాలో ఇలా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని చెప్పారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు టంప్‌నకు సహకరిస్తామని అన్నారు.