Gold Loan: గోల్డ్ లోన్ పెడదాం అని మీ మనసులో రాగానే.. ఫస్ట్ ఈ కింద లిస్ట్ చెక్ చేసుకోండి.. ఆ తర్వాత..

చాలా మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటుంటారు.

Gold Loan: గోల్డ్ లోన్ పెడదాం అని మీ మనసులో రాగానే.. ఫస్ట్ ఈ కింద లిస్ట్ చెక్ చేసుకోండి.. ఆ తర్వాత..

Updated On : February 14, 2025 / 6:02 PM IST

బంగారం ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. డబ్బులు లేనప్పుడు బంగారాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకుంటారు చాలా మంది. పాతకాలంలోనైతే అధికంగా వడ్డీ వ్యాపారుల వద్ద పసిడిని తాకట్టు పెట్లి అప్పులు తీసుకునేవారు.

ఇప్పుడు బ్యాంకులు కూడా వాటిపై రుణాలు ఇస్తుండడంతో వీటివైపుగానూ ప్రజలు మళ్లుతున్నారు. బ్యాంకులు బంగారంపై రుణాలు ఇచ్చేటప్పుడు క్రెడిట్‌ స్కోరు వంటివి చూడాల్సిన అవసరం లేదు.

అలాగే, రుణాలు తీసుకునే వ్యక్తులు తిరిగి చెల్లించగలరా? అన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బంగారాన్ని తాకట్టుగా పెడతారు కాబట్టి ఆ విషయాలను పరిశీలించాల్సిన అవసరం బ్యాంకులకు లేదు.

బంగారం రుణాన్ని పలు బ్యాంకుల్లో నిమిషాల్లోనే తీసుకోవచ్చు. ఇతర అన్ని రుణాలకంటే పసిడిపై రుణం పొందడమే తేలిక. అయితే, బంగారంపై రుణాన్ని తీసుకోవాలంటే పలు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.

Also Read: వేసవికాలం వచ్చేసింది.. అత్యధికంగా అమ్ముడుపోతున్న ఏసీలు ఇవే.. ఆఫర్లు చూశారా?

ఒకవేళ మీకు అప్పు కావాల్సి వచ్చినప్పుడు మీ నుంచి హామీగా బ్యాంకులు పసిడిని హామీగా తీసుకుంటాయి. ఆ పసిడిన బ్యాంకులు భద్రపరచాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన పసిడిన బ్యాంకు స్ట్రాంగ్‌ రూంలో భద్రపరుస్తుందా? అన్న విషాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది.

చోరీ జరిగినా, అగ్ని ప్రమాదం సంభవించినా, ఇంకేదైనా ప్రమాదం జరిగినా సేఫ్ జోన్‌లో ఉండడానికి తప్పనిసరిగా ఇన్సురెన్స్‌ పాటు సురక్షితమైన వ్యవస్థలు ఉండాలి. బ్యాంకుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ పటిష్ఠంగా ఉందో లేదో తెలుసుకోండి.

ఇవన్నీ పరిశీలిస్తూ మీ పసిడి భద్రంగానే ఉంటుందన్న నమ్మకం మీకు కలుగుతుంది. అటువంటి బ్యాంకులో మీరు బంగారాన్ని తాకట్టు పెట్టాలి. బంగారంపై అప్పులు ఇస్తున్న కొన్ని సంస్థలు పలు అక్రమ పద్ధతులు పాటిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా పరిశీలనలోకి వచ్చింది. రుణాలు ఇవ్వడానికి కొన్ని సంస్థలు థర్డ్‌ పార్టీలను వాడుతున్నాయి.

అలా వాడడంలో ఎన్నో లోపాలు ఉంటున్నాయి. ఒకవేళ రుణం డిఫాల్టయితే బంగారం వేలం సమయంలో సరైన విధానాలు పాటించడం లేదు. దీంతో బంగారంపై రుణం తీసుకున్న వారు నష్టపోతారు. పసిడి రుణాలపై వడ్డీ రేటు ఇతర వాటితో పోల్చితే కనిష్టంగానే ఉంటుంది.

బంగారంపై రుణాలు తీసుకునేవారు బ్యాంకులు ఇచ్చే ఆఫర్లను పరిశీలించాయి. వడ్డీ రేట్లతో పాటు మొత్తం రుణం ఎంత వస్తుంది, ఈఎంఐల కాలవ్యవధి ఎంత ఉంటుందన్న విషయాన్ని క్షుణ్ణంగా చూసుకోవాలి. చాలా బ్యాంకులు పసిడి రుణాలపై ఈఎంఐల సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి.