Apple iPhone 17 Series
Apple iPhone 17 Series : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ వారం రోజుల క్రితమే లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఐఫోన్ 17 సిరీస్ మోడల్స్ ప్రీ-ఆర్డర్లు కొన్ని రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి.
ఇప్పుడు కొత్త లైనప్ ఫస్ట్ సేల్ సేల్ (Apple iPhone 17 Series) సెప్టెంబర్ 19, 2025 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి, మీకు నచ్చిన ఏ ఐఫోన్‌నైనా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ ధర, లభ్యత, ఈఎంఐ ఆఫర్‌లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ ధరలు :
ఆపిల్ ఐఫోన్ 17 బేస్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ భారత మార్కెట్లో రూ.82,900కు లభిస్తుంది. ఈ ఐఫోన్ 17 సిరీస్ 512GB స్టోరేజ్ వేరియంట్ రూ.1,02,900కు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ ఎయిర్ విషయానికొస్తే.. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,900, 1TB హై-ఎండ్ వేరియంట్ ధర రూ.1,59,900కు ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.1,34,900 కు, హై-ఎండ్ 1TB స్టోరేజ్ వేరియంట్ రూ.1,74,900కు లభిస్తుంది. అదేవిధంగా, ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,900కు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ హై-ఎండ్ 2TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.2,29,900కు లభిస్తుంది.
ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ ఈఎంఐ ఆప్షన్లు, బ్యాంక్ ఆఫర్లు :
భారతదేశంలోని బహుళ బ్యాంకులతో భాగస్వామ్యంతో ఆపిల్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. తద్వారా తమకు ఇష్టమైన ఐఫోన్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుల ద్వారా ఐఫోన్ 17ను ప్రీ-ఆర్డర్ చేసినందుకు రూ. 5,000 ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇంకా, వినియోగదారులు తమ పాత ఐఫోన్‌లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
భారత్‌లో ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ లభ్యత :
ఆపిల్ రెగ్యులర్ వేరియంట్లలో ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ మోడళ్లను ముందస్తు ఆర్డర్ చేసిన కస్టమర్లు మార్కెట్ డిమాండ్ ఆధారంగా డెలివరీలను పొందుతారు. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ ఎయిర్ డెలివరీలు సెప్టెంబర్ 19, 2025 నుంచి ప్రారంభమవుతాయి. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌కు భారీ డిమాండ్ పెరగడంతో ఈ రెండింటి డెలివరీ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని ఆపిల్ పేర్కొంది.