Apple iPhone 17e
Apple iPhone 17e : ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ రాబోతుంది. వచ్చే మార్చిలో ఆపిల్ ఐఫోన్ 17e లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లీకుల ప్రకారం.. ఈ ఐఫోన్ సింగిల్ రియర్ కెమెరా సిస్టమ్, లేటెస్ట్ ఆపిల్ ఇన్-హౌస్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో రానుందని అంచనా. కొత్త ఐఫోన్ స్పెషిఫికేషన్లు, కెమెరా, డిజైన్ సహా అన్ని వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
ఐఫోన్ 17e స్పెసిఫికేషన్లు , కెమెరా, డిజైన్ :
ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ అద్భుతమైన స్పెసిఫికేషన్లు, స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్, 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. ఈ ఐఫోన్ మోడల్ 4005mAh బ్యాటరీతో వస్తుంది. మ్యాగ్ సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని లీక్‌లు సూచిస్తున్నాయి.
ఆపిల్ ఐఫోన్ 17, పాత ఐఫోన్ 16e డిజైన్ పరంగా బాగుంటాయి. కానీ, ఆపిల్ ఈసారి సన్నని ఛాసిస్ వేరియంట్ అందించే అవకాశం ఉంది. అలాగే, ఈ సిరీస్‌లో ఇతర ఐఫోన్‌ల మాదిరిగానే ఈ ఐఫోన్ కూడా కొత్త కలర్ ఆప్షన్లను అందిస్తుందని అంచనా. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కూడా సరసమైన ధరకే లభిస్తున్నాయి.
Read Also : E-Pan Card : మీకు ఇ-పాన్ కార్డు లేదా? అర్జెంట్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఎలాగంటే? సింపుల్ గైడ్ మీకోసం
ఆప్టిక్ విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 17eలో సింగిల్ సెన్సార్‌తో అద్భుతమైన షాట్స్ తీసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP సెంటర్ స్టేజ్ షూటర్ ఉండవచ్చు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్ 18MP ఫ్రంట్ షూటర్ కూడా ఉంది.
భారత్‌లో ఐఫోన్ 17e ధర, లాంచ్ తేదీ :
ఈ ఐఫోన్ 17e ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి 2026 మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర విషయానికొస్తే.. ఈ ఐఫోన్ ధర దాదాపు రూ. 65వేలు ఉండొచ్చనని అంచనా. ఈ ఐఫోన్‌కు సంబంధించి అన్ని వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.