iPhone users can now ask
iPhone Siri Users : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మెసేంజర్ యాప్ కోసం కొత్త ఫీచర్‌లను రిలీజ్ చేసింది. ఐఫోన్ యూజర్లు నిరంతరం కనెక్ట్ అయ్యేలా లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రవేశపెట్టింది. ఆపిల్ సిరి ఇంటిగ్రేషన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. వాయిస్ కమాండ్స్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీ కాల్స్, మెసేజ్‌లను అనుమతిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 7 బిలియన్ నిమిషాల కన్నా ఎక్కువ కాల్స్ అందుకునేలా కాలింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మెసెంజర్ మరింత అప్‌గ్రేడ్ చేస్తోంది.
అయితే, కొత్త సిరి ఇంటిగ్రేషన్ యూజర్లు తమ ఫోన్‌లను టచ్ చేయకుండానే మెసెంజర్‌లో కాల్స్ చేయడం లేదా మెసేజ్‌లను పంపేందుకు అనుమతిస్తుంది. “హే సిరి, మెసెంజర్‌లో మెసేజ్ పంపండి” లేదా “హే సిరి, మెసెంజర్‌లో [పేరు] కాల్ చేయండి” వంటి కమాండ్స్ అందించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ దగ్గరలో డివైజ్ అందుబాటులో లేనప్పుడు కనెక్ట్ అయ్యేందుకు వీలుగా ఉంటుంది.
వీడియో కాలింగ్‌కు మరింత క్రియేటివిటీని అందించేలా మెసెంజర్ ఇప్పుడు ఏఐ రూపొందించిన బ్యాక్‌గ్రౌండ్లను అందిస్తుంది. వినియోగదారులు కాల్ సమయంలో ఎఫెక్ట్స్ ఐకాన్ ట్యాప్ చేసి “బ్యాక్‌గ్రౌండ్‌లు” ఎంచుకోవడం ద్వారా కస్టమైజడ్ విజువల్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఈ ఫీచర్ యూజర్లు తమ మానసిక స్థితిని పెంపొందించుకోవడానికి అనుమతిస్తుంది. మెటా కాల్ క్వాలిటీని అప్‌గ్రేడ్ చేయడంపై దృష్టిసారిస్తోంది.
హెచ్‌డీ వీడియో కాలింగ్ ఇప్పుడు వై-ఫై యూజర్లకు డిఫాల్ట్‌గా అందుబాటులో ఉంది. మొబైల్ డేటాలో ఉన్నవారు కాల్ సెట్టింగ్స్‌లో ఎనేబుల్ చేయొచ్చు. నాయిస్ సప్రెషన్, వాయిస్ ఐసోలేషన్ వంటి అదనపు ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి. కాల్స్ యూజర్ కన్వర్జేషన్ మాదిరిగా స్పష్టంగా అనిపించేలా చేస్తాయి. ధ్వనించే పరిసరాలలో క్వాలిటీని అందించేలా ఈ టూల్స్ ఉపయోగపడతాయి. మెసెంజర్ యూజర్లు తమ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోతే ఇప్పుడు ఆడియో లేదా వీడియో మెసేజ్‌లను పంపవచ్చు. “రికార్డ్ మెసేజ్” బటన్ యూజర్లు తమ అప్‌డేట్స్ లేదా పర్సనల్ నోట్స్ షేర్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఈ కొత్త అప్‌డేట్‌లతో మెసెంజర్ మెసేజింగ్ యాప్‌గా మారుతోంది. అడ్వాన్స్‌డ్ డిజిటల్ టూల్స్ ద్వారా సాంప్రదాయ ఫోన్‌లకు పోటీగా అనేక రకాల ఫీచర్‌లను అందిస్తుంది. మీరు హ్యాండ్స్-ఫ్రీ మెసేజ్‌లను సిరితో పంపుతున్నా లేదా ఏఐ బ్యాక్ గ్రౌండ్‌తో వీడియో కాల్స్ కస్టమైజ్ చేసినా లేదా హైక్వాలిటీ ఆడియోను పొందినా అన్నింటికి ఈ ప్లాట్‌ఫారమ్ అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
Read Also : Vivo Y300 5G Launch : వివో కొత్త 5జీ ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?