Best Jio Plans : మే 17 నుంచే ఐపీఎల్ స్టార్ట్.. బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. ఫ్రీగా జియోహాట్‌స్టార్.. ఫుల్ డిటెయిల్స్..!

Best Jio Plans : ఐపీఎల్ 2025 సీజన్ మే 17న తిరిగి ప్రారంభమై జూన్ 3న ముగియనుంది. జియోహాట్‌స్టార్ కూడా ఉచితంగా యాక్సస్ చేయొచ్చు.

Best Jio Plans

Best Jio Plans : ఐపీఎల్ 2025 మే 17న తిరిగి ప్రారంభం కానుంది. టోర్నమెంట్ జూన్ 3న ముగియనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మే 9న సీజన్‌ను టోర్నీ నిలిచిపోయింది. ఇప్పుడు లీగ్ మళ్లీ ప్రారంభం కానుంది.

ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులు ఇప్పుడు మ్యాచ్‌లను వీక్షించవచ్చు. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్‌లో చూడాలనుకుంటే జియో ప్లాన్లలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.

Read Also : iPhone 16 Price : ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. ఆపిల్ లవర్స్ ఇలా చేస్తే అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

జియో హాట్‌స్టార్ ద్వారా వినియోగదారులు స్ట్రీమింగ్ యాక్సెస్‌ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ప్రస్తుతం, జియో హాట్‌స్టార్ యాక్సెస్‌తో 3 కీలక ప్లాన్‌లను అందిస్తోంది.

1. జియో రూ. 100 యాడ్-ఆన్ ప్లాన్ :
ఇప్పటికే జియో బేస్ రీఛార్జ్ ప్లాన్ ఉంటే.. రూ. 100 యాడ్-ఆన్ బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్. 5GB అదనపు డేటాతో పాటు 90 రోజుల జియోహాట్‌స్టార్ యాక్సెస్‌ను అందిస్తుంది.

వాయిస్ లేదా SMS బెనిఫిట్స్ అందించనప్పటికీ, ఐపీఎల్ స్ట్రీమింగ్ కోసం డేటా బూస్ట్ మాత్రమే అవసరమయ్యే యూజర్లకు సరైనది.

2. జియో రూ. 195 క్రికెట్ ప్యాక్ :
195 క్రికెట్ ప్యాక్ 15GB వన్-టైమ్ డేటాను అలాగే 90 రోజుల (JioHotstar) యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో కాల్, SMS బెనిఫిట్స్ లేనప్పటికీ ప్రతి మ్యాచ్ తమ ఫోన్‌లో లైవ్ చూడాలనుకునే వారికి ఫుల్ డేటాను అందిస్తుంది.

3. జియో రూ. 949 పూర్తి రీఛార్జ్ ప్లాన్ :
84 రోజుల వ్యాలిడిటీతో రూ. 949కు పొందొచ్చు. రోజుకు 2GB 4G డేటాను అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS ఆప్షన్లను అందిస్తుంది.

Read Also : OnePlus 13s : వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌కు వన్‌ప్లస్ 13s వచ్చేస్తోంది.. కలర్ ఆప్షన్లు, లాంచ్ టైమ్‌లైన్, ధర వివరాలివే..

ఇందులో జియోక్లౌడ్ స్టోరేజీ, జియోహాట్‌స్టార్ యాక్సెస్ కూడా ఉన్నాయి. ఒకే ప్యాకేజీలో ఎంటర్‌టైన్మెంట్, కనెక్టివిటీ కోసం చూస్తున్న క్రికెట్ అభిమానులకు బెస్ట్ ఆప్షన్.