iQOO 13 Design Leak : కొత్త ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, ఫీచర్లు లీక్..!

iQOO 13 Design Leak : రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా ఐక్యూ 13 త్వరలో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ కొన్ని స్పెసిఫికేషన్‌లను ఆన్‌లైన్‌లో రివీల్ చేసింది.

iQOO 13 Design Revealed in Leaked Live Images ( Image Source : Google )

iQOO 13 Design Leak : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ నుంచి సరికొత్త మోడల్ రాబోతుంది. కంపెనీ రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా ఐక్యూ 13 త్వరలో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ కొన్ని స్పెసిఫికేషన్‌లను ఆన్‌లైన్‌లో రివీల్ చేసింది. ఇప్పుడు ఐక్యూ 13 లైవ్ ఫొటోలు లీక్ అయ్యాయి.

ఈ లీక్ ఫొటోలను పరిశీలిస్తే.. ఐక్యూ 13 ఫోన్ నుంచి ఎలాంటి ఫీచర్లు ఉండవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఐక్యూ 13 అక్టోబర్ చివరిలో చైనాలో లాంచ్ అయింది. క్వాల్‌కామ్ నుంచి నెక్స్ట్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 (లేదా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్) చిప్‌సెట్‌తో లాంచ్ అయిన మొదటి స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటి.

ఐక్యూ 13 డిజైన్ లీక్.. ఫొటో వైరల్ :
చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఐక్యూ 13 ఫొటోలు వైరల్ అయ్యాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ సూచిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ లైవ్ ఇమేజ్‌లు రెండు క్లోజ్ అప్ ఇమేజ్‌లతో సహా స్క్రీన్ టాప్, బాటమ్ కనిపిస్తున్నాయి. ఫ్లాట్ డిజైన్‌తో పాటు నాలుగు వైపులా న్యారో బెజెల్స్‌తో కనిపిస్తుంది. ఈ లీకైన ఫొటోలు ఐక్యూ 13లోని బటన్ కలిగి ఉన్నాయి.

వాల్యూమ్ రాకర్, స్క్రీన్ కుడి వైపున ఉన్న పవర్ బటన్, మెటల్ ఫ్రేమ్ ఫ్లాట్ ఎడ్జ్ కలిగి ఉంది. ఈ ఫొటోలు ఐక్యూ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ ధృవీకరించినట్లుగా కనిపిస్తున్నాయి. గత వారమే ఐక్యూ 13 2కె రిజల్యూషన్‌తో బీఓఈ నెక్స్ట్ జనరేషన్ క్యూ10 డిస్‌ప్లేతో అమర్చి ఉన్నట్టు కంపెనీ ధృవీకరించింది. ఐక్యూ నుంచి వచ్చే నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2కె అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని గత లీక్‌లు సూచించాయి.

ఐక్యూ 13 క్వాల్‌కామ్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 లేదా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌గా అక్టోబర్ 21న ఆవిష్కరించనుందని భావిస్తున్నారు. 16జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మునుపటి నివేదికల ప్రకారం.. ఐక్యూ 13 ట్రిపుల్ 50ఎంపీ ప్రైమరీ, అల్ట్రావైడ్, 2ఎక్స్ టెలిఫోటో కెమెరాలతో పాటు 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో రావచ్చు. 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,150mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : WhatsApp Video Calls : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్స్ కోసం లో-లైటింగ్ మోడ్.. ఇదేలా పనిచేస్తుందంటే?