WhatsApp Video Calls : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్స్ కోసం లో-లైటింగ్ మోడ్.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Video Calls : లేటెస్ట్ వాట్సాప్ అప్‌డేట్, మెసేజింగ్ యాప్ మొబైల్ వెర్షన్‌లో మాత్రమే వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

WhatsApp Video Calls : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్స్ కోసం లో-లైటింగ్ మోడ్.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Now Has A Low-Light Mode For Your Video Calls

Updated On : October 19, 2024 / 10:38 PM IST

WhatsApp Video Calls : వాట్సాప్ యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది. వీడియో కాల్స్ చేసే సమయంలో ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. లైటింగ్ పరిస్థితులు సరిగా లేనప్పుడు ఫొటోలను క్లిక్ చేసేందుకు మిలియన్ల మంది లో-లైటింగ్ మోడ్‌పై ఆధారపడుతున్నారు. ఇప్పుడు, వాట్సాప్ కాంతి తక్కువగా ఉన్న ప్రదేశాలలో వీడియో కాల్స్ చేయడంలో మీకు ఈ మోడ్‌ ఉపయోగపడుతుంది.

మెసేజింగ్ యాప్‌లో వీడియో కాల్స్ డిమాండ్ ఆధారంగా చాలా ఫోన్‌లు ఫ్రంట్ కెమెరాతో వస్తాయి. ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు విజువల్స్‌లో బాగా కనిపిస్తాయి. వ్యక్తి స్పష్టమైన ముఖాన్ని చూడవచ్చు. వారి లొకేషన్ మార్చకుండా ఈ లో లైటింగ్ మోడ్‌ను ఉపయోగించవచ్చు.

వీడియో కాల్స్ కోసం లైటింగ్ మోడ్ : ఎలా ఉపయోగించాలంటే? :
లేటెస్ట్ వాట్సాప్ అప్‌డేట్, మెసేజింగ్ యాప్ మొబైల్ వెర్షన్‌లో మాత్రమే వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మీరు కొత్త ఫీచర్‌ని పొందినట్లయితే.. కొత్త మోడ్‌ని ఉపయోగించడానికి ఈ కింది విధంగా ప్రయత్నించండి.

  • మీ ఐఓఎస్/ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • వాట్సాప్‌లో వీడియో కాల్ చేయండి
  • ఇంటర్‌ఫేస్‌లో కుడివైపు ఎగువన కనిపించే బల్బ్ ఐకాన్ క్లిక్ చేయండి
  • మీరు సాధారణ కాంతి పరిస్థితుల్లో మాన్యువల్‌గా ఆఫ్ చేయవచ్చు

వాట్సాప్ కొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తూనే ఉంది. ఇందులో స్టేటస్ అప్‌డేట్‌లు, ఛానెల్‌ కోసం అనేక ఫీచర్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా, మెసేజింగ్ యాప్ ఐఓఎస్ యూజర్ల కోసం కొత్త చాట్ థీమ్ పికర్ టూల్‌ను ప్రయత్నిస్తోంది. చాట్ థీమ్‌ను డార్క్, లైటింగ్ భిన్నంగా మార్చేందుకు మాత్రమే కాకుండా వివిధ యూజర్ల కోసం చాట్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మార్చేందుకు అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వాట్సాప్ వెర్షన్‌లు ఇటీవలే టూల్‌ను అందుకున్నాయి. త్వరలో అధికారికంగా ఫీచర్లు రిలీజ్ కానున్నాయి.

Read Also : Xiaomi First 5G Phone : రూ.10వేల లోపు ధరలో షావోమీ ఫస్ట్ 5జీ ఫోన్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?