iQOO 13 First Sale : ఐక్యూ 13 ఫోన్ లాంచ్ ఆఫర్లు.. ఫస్ట్ సేల్ ఎప్పటినుంచంటే?

iQOO 13 First Sale : ఐక్యూ 13 ఫోన్ సేల్ డిసెంబర్ 11న మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ నార్డో గ్రే, లెజెండ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

iQOO 13 first sale in India tomorrow

iQOO 13 First Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఐక్యూ బ్రాండ్ నుంచి సరికొత్త మోడల్ ఐక్యూ 13 ఫోన్ ఇటీవలే లాంచ్ అయింది. ఈ కొత్త ఫోన్ సేల్ రేపటి నుంచి అంటే.. 11 డిసెంబర్ 2024 భారతదేశంలో విక్రయానికి రానుంది.

ఐక్యూ 13 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని బెస్ట్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఇందులో 2కె రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ కొత్త ఐక్యూ 13 ఫోన్ ధర, లాంచ్, సేల్ ఆఫర్‌లతో సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఐక్యూ 13 సేల్ డిసెంబర్ 11న మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ నార్డో గ్రే, లెజెండ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై రూ. 3వేల ఫ్లాట్ డిస్కౌంట్ సహా లాంచ్ ఆఫర్‌ల నుంచి కస్టమర్‌లు ప్రయోజనం పొందవచ్చు.

వినియోగదారులు నాన్-వివో/ఐక్యూ ఫోన్ల కోసం రూ. 3వేలు, వివో/ఐక్యూ ఫోన్ల కోసం రూ. 5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. అదనంగా, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు 9 నెలల వరకు అందుబాటులో ఉంటాయి. ఐక్యూ 13, వివో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, ఐక్యూ ఇ-స్టోర్, అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంటుంది.

ఐక్యూ 13 సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, ఐక్యూ యాజమాన్య సూపర్‌కంప్యూటింగ్ చిప్ క్యూ2తో అమర్చారు. విజువల్ ఎక్సలెన్స్ విషయానికి వస్తే.. కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసేలా 2కె సూపర్ రిజల్యూషన్, 144 ఎఫ్‌పీఎస్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్‌పోలేషన్‌ను ఇంటిగ్రేట్ చేస్తుంది.

ప్రపంచంలోని మొట్టమొదటి క్యూ10 మోడల్ 2కె 144Hz అల్ట్రా ఐకేర్ డిస్‌ప్లేతో పాటు అద్భుతమైన మాన్‌స్టర్ హాలో డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 120డబ్ల్యూ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 6000mAh బ్యాటరీతో ప్యాక్ అయింది. కేవలం 30 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయగలదు.

ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 921 వీసీఎస్ ట్రూ-కలర్ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 816 టెలిఫోటో లెన్స్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 60FPS వద్ద 4కె వీడియోకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 4ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌ల హామీతో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా సరికొత్త ఫన్‌టచ్ ఓఎస్ 15తో రన్ అవుతుంది.

Read Also : Moto G35 Launch : మోటోరోలా మోటో G35 ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!