iQOO 15 Price
iQOO 15 Price : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ రాబోతుంది. ఈ నెల చివరిలో చైనాలో ఐక్యూ 15 లాంచ్ కానుంది. ఇప్పటికే కంపెనీ ఈ ఐక్యూ ఫోన్ కీలక ఫీచర్లను వెల్లడిస్తోంది. ఐక్యూ 15 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.
IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కలిగి ఉంది. ధర, స్పెసిఫికేషన్లు, డిజైన్, భారత్ (iQOO 15 Price) లాంచ్ టైమ్‌లైన్ సహా రాబోయే ఐక్యూ 15 గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐక్యూ 15 డిజైన్, కలర్ ఆప్షన్లు :
ఐక్యూ అధికారిక టీజర్లను పరిశీలిస్తే.. రాబోయే ఫ్లాగ్‌షిప్ డిజైన్ బ్యాక్ ప్యానెల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు ఉంటాయి. అందులో ఒకటి మార్బల్ వంటి ఫినిషింగ్ డిజైన్, మరొకటి ‘లింగ్యున్’ అని పిలుస్తారు. ఈ హ్యాండ్‌సెట్ ఫ్యూచరిస్టిక్ టచ్ కోసం ఫ్రేమ్‌లో మెటాలిక్ ఫ్రేమ్, రైట్-యాంగిల్ కార్నర్స్, మైక్రో RGB లైట్ స్ట్రిప్ కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
iQOO 15 స్పెసిఫికేషన్లు :
ఐక్యూ 15 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని ఐక్యూ ధృవీకరించింది, ఈ ఫీచర్ గత కొన్ని మోడళ్లలో అందుబాటులో లేదు. IP68, IP69 రేటింగ్ కూడా పొందుతుంది. హుడ్ కింద, ఐక్యూ 15 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఐక్యూ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.85-అంగుళాల క్యూహెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
ఫ్రంట్ సైడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్ 1/1.5-అంగుళాల సెన్సార్ సైజుతో 50MP ప్రైమరీ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఆకట్టుకునేలా జూమింగ్ ఫీచర్లను అందిస్తుంది. అంతేకాదు.. భారీ 7000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఐక్యూ ఫోన్ 8K స్టీమ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఐక్యూ 15 భారత్ ధర, లాంచ్ తేదీ (అంచనా) :
ఈ నెలలో చైనాలో ఐక్యూ 15 లాంచ్ కానుంది. భారత మార్కెట్లో నవంబర్ 15 లేదా నవంబర్ 25, 2025 మధ్య ఐక్యూ కొత్త ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లీక్‌లను పరిశీలిస్తే.. ఈ ఫోన్ భారత మార్కెట్లో రూ.59,999 కన్నా తక్కువ ధరకు లాంచ్ కావచ్చు. ఐక్యూ 13 బేస్ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.54,999కి లాంచ్ అయింది. ఐక్యూ 15 కూడా ఇదే ధర రేంజ్‌లో వచ్చే అవకాశం ఉంది.