iQOO 16 Phone : గేమింగ్ కింగ్‌కు కొత్త అవతారం.. ట్రిపుల్ కెమెరాలతో దుమ్మురేపనున్న ఐక్యూ ఫోన్

iQOO 16 Phone : ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లో 100x వరకు డిజిటల్ జూమ్, ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంది. ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. పూర్తి వివరాలివే..

  • Published on- September 12, 2026 / 08:07 PM IST

iQOO 16 Launch

  • ఐక్యూ 16లో సరికొత్త డిజైన్ రియర్ కెమెరా మాడ్యూల్
  • ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ స్పెషల్ అట్రాక్షన్
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.85 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఉండొచ్చు

iQOO 16 Phone : ఐక్యూ అభిమానుల కోసం అదిరిపోయే ఫోన్.. చైనీస్ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ వివో సబ్-బ్రాండ్ ఐక్యూ త్వరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఐక్యూ 16 కీలక స్పెసిఫికేషన్లను ఆ కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్ రియర్ కెమెరా మాడ్యూల్ ఫ్లాట్ రియర్ ప్యానెల్ ఉంటాయి. ఇందులో కొత్త గేమింగ్ చిప్ కూడా ఉండనుంది.

ఐక్యూ కంపెనీ రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబోలో వెల్లడించింది. ఐక్యూ 16 ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా డిజైన్ చేసిన కెమెరా మాడ్యూల్ ఉంది. ఐక్యూ 16 రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది.

ఐక్యూ 15కు అప్‌గ్రేడ్ వెర్షన్ :
3 కెమెరా లెన్స్‌లతో ‘రోబోటిక్ ఆర్మ్’ డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ‘హెక్సాగనల్ టెక్ ప్యాటర్న్’తో గ్లాస్ రియర్ ప్యానెల్‌తో వస్తుంది. ఐక్యూ 16లో రియర్ కెమెరా మాడ్యూల్ లోపల ‘100 x టెలి లెన్స్’ అనే టెక్స్ట్ కనిపిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో భారత మార్కెట్లో ఐక్యూ 15 లాంచ్ అయింది.

Read Also : Apple iPhone 18 Pro Series : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ ప్రీ-ఆర్డర్లు షురూ.. ధరలు, ఆఫర్లు ఇవే!

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 100x వరకు డిజిటల్ జూమ్ కెపాసిటీ ఉంటుంది. ఐక్యూ 16 ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెటల్ మిడ్-ఫ్రేమ్ ఉంటుంది. పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఉంటాయి. ఐక్యూ 16 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

ఫీచర్లు లీక్ :
నివేదికల ప్రకారం.. ఐక్యూ 16 ఇంజనీరింగ్ ప్రోటోటైప్ వివరాలు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2K రిజల్యూషన్ 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.85-అంగుళాల ఫ్లాట్ శాంసంగ్ డిస్‌ప్లే ఉండొచ్చు. ఐక్యూ 16, క్వాల్‌కామ్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అడ్రెనో 850 జీపీయూ ఉండొచ్చు. ఐక్యూ 16 ప్రోటోటైప్‌లో సిమెట్రికల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం ఇందులో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉండొచ్చు. ఐక్యూ 16లో 8,500mAh బ్యాటరీ ఉండొచ్చు. సేఫ్టీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండొచ్చు. ఇటీవలే I2601 మోడల్ నంబర్‌తో IMEI డేటాబేస్‌లో కనిపించింది. మెమరీ చిప్‌ల ధరల పెంపు నేపథ్యంలో ఐక్యూ 16 భారత మార్కెట్లో లాంచ్ అయ్యే ఛాన్స్ లేదు.