iQOO Neo 10 : గేమర్లకు పండగే.. 7000mAh బ్యాటరీతో ఐక్యూ నియో 10 కొత్త అవతార్.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?
iQOO Neo 10 : ఐక్యూ నియో 10 కొత్త అవతార్‌లో వస్తుంది. 7000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
iQOO Neo 10
- ఐక్యూ నియో 10 కొత్త అవతార్ వచ్చేసింది
- 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు
- అమెజాన్, ఐక్యూ వెబ్సైట్లో మే 5 నుంచి ఫస్ట్ సేల్
iQOO Neo 10 : కొత్త ఐక్యూ ఫోన్ కొంటున్నారా? ఇది మీకోసమే.. ఐక్యూ నియో 10 ఇప్పుడు భారత మార్కెట్లో రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ ఫోన్లో 7000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 ప్రాసెసర్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ సేల్స్ మే 5వ తేదీన ప్రారంభమవుతాయి.
ధర ఎంతంటే? :
ఐక్యూ నియో 10 ఆల్పైన్ వైట్, ఆస్ఫాల్ట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేసింది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా ఉంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ రూ. 42,999కి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ కింద ఈ ఫోన్ వరుసగా రూ. 34,999, రూ. 40,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.
ఈ కొత్త కలర్ వేరియంట్ల సేల్స్ మే 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ అధికారిక ఐక్యూ ఇండియా వెబ్సైట్లో ప్రారంభమవుతాయి. ఇన్ఫెర్నో రెడ్ టైటానియం క్రోమ్ వేరియంట్లతో పాటు ఈ ఫోన్ కూడా అందుబాటులో ఉంది.
డిస్ప్లే, పర్ఫార్మెన్స్ ఆప్షన్లు :
ఐక్యూ నియో 10 ఫోన్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే అందిస్తుంది. ఈ స్క్రీన్ 5500 నిట్స్ వరకు లోకల్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
హై-ఎండ్ గేమింగ్ మల్టీటాస్కింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది. 12GB వరకు LPDDR5X అల్ట్రా ర్యామ్ 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది.
కెమెరా, బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు :
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐక్యూ నియో 10లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.
ఈ ఫోన్లో స్పెషల్ క్యూ1 గేమింగ్ చిప్ 7000 చదరపు మిల్లీమీటర్ల వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉన్నాయి. లాంగ్ గేమింగ్ సెషన్లతో టెంపేరచర్ కంట్రోల్ చేస్తుంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 7000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ IP65 రేటింగ్ అందిస్తుంది.
