iQOO Neo 10R 5G India Launch
iQOO Neo 10R 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి త్వరలో కొత్త ఐక్యూ నియో 10ఆర్ 5జీ ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ రూ. 30వేల లోపు ధరలో ఉంటుంది. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ ఫోన్ నియో 10, నియో 10 ప్రో ఫోన్‌లను కలిగిన ఐక్యూ నియో 10 సిరీస్‌లో భాగంగా ఉంటుందని భావిస్తున్నారు.
అయితే, ప్రస్తుతం చైనాలో మాత్రమే ఈ ఐక్యూ నియో 10ఆర్ 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో 12జీబీ వరకు ర్యామ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఐక్యూ నియో 10ఆర్ 5జీ ఫోన్ ఫిబ్రవరిలో ఎప్పుడైనా దేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐక్యూ ఫోన్‌ను బ్లూ వైట్ స్లైస్, లూనార్ టైటానియం అనే రెండు కలర్ ఆప్షన్లలో విక్రయించవచ్చు. ధర విషయానికొస్తే.. మార్కెట్లో రూ.30వేల లోపు అందుబాటులో ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో, కొత్త పోకో ఎక్స్7ప్రో వంటి ఫోన్లతో పోటీపడే అవకాశం ఉంది. అయితే, ఐక్యూ హ్యాండ్‌సెట్ అన్ని వేరియంట్‌లు ఈ ధరలోకి వస్తాయో లేదో క్లారిటీ లేదు.
ఐక్యూ నియో 10ఆర్ 5జీ స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
ఐక్యూ నియో 10ఆర్ 5జీ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మోడల్ నంబర్ ‘I2221’తో రావచ్చు. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అదే స్టోరేజీ సామర్థ్యంతో రెండు ర్యామ్ వేరియంట్ (8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ)లో విక్రయించనుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని అంచనా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉండవచ్చు. ఐక్యూ నియో 10ఆర్ 5జీ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,400mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.