iQOO Neo 10R launched
iQOO Neo 10R Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. కంపెనీ నియో సిరీస్‌లో ఐక్యూ నియో 10R ఫోన్ లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో గత ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయిన నియో 9 ప్రో కూడా ఉంది.
ఐక్యూ నియో 10ఆర్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 చిప్‌సెట్, 1.5కె రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగిన అమోల్డ్ డిస్‌ప్లే వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. డెస్ట్, స్ప్లాష్ నిరోధకతకు IP65 రేటింగ్, 50ఎంపీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,400mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఐక్యూ నియో 10ఆర్ ఫోన్ ముఖ్యమైన ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్‌లో ధర ఎంతంటే? :
ఐక్యూ నియో 10ఆర్ కొనేందుకు రెడీగా ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ కలిగిన మోడల్ రూ. 26,999 నుంచి ప్రారంభమవుతుంది. మీకు ఎక్కువ స్టోరేజీ కావాలంటే 8జీబీ ర్యామ్ + 256జీబీ వెర్షన్ ధర రూ. 28,999కు అందుబాటులో ఉంది. అయితే, పవర్‌హౌస్ 12జీబీ ర్యామ్+ 256జీబీ మోడల్ రూ.30,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూన్‌నైట్ టైటానియం, ర్యాగింగ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు అమెజాన్ లేదా ఐక్యూ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రీ-బుకింగ్ మార్చి 12 నుంచే ప్రారంభమవుతుంది. ఐక్యూ నియో 10ఆర్ ప్రీ-బుక్ చేసుకున్న కొనుగోలుదారులు 12 నెలల ఎక్స్‌టెండెడ్ వారంటీని డెలివరీ తర్వాత కేవలం రూ. 99కు సెటప్ పొందవచ్చు.
అదేవిధంగా, బ్యాంక్ లావాదేవీలపై రూ. 2వేల తగ్గింపు, రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ఆకర్షణీయమైన డీల్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ కార్డులతో మీరు ఈ ఫోన్ రూ. 24,999 కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అడ్వాన్స్ ఆర్డర్ చేసే వారికి మార్చి 18 నుంచి ఫోన్లు పికప్ చేసేందుకు రెడీగా ఉంటాయి. మార్చి 19 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి.
ఐక్యూ నియో 10R స్పెసిఫికేషన్లు :
ఐక్యూ నియో 10R డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్, ఫన్‌టచ్ ఓఎస్ 15తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. 1,260 x 2,800 పిక్సెల్‌ల రిజల్యూషన్, లైటనింగ్ స్పీడ్ 120Hz రిఫ్రెష్ రేట్, ఆకట్టుకునే 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్‌ను అందించే అద్భుతమైన 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ డిస్‌ప్లే 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో గేమర్‌ల కోసం రూపొందించింది. ఈ ఫోన్‌లో (Schott Xensation Up) గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్ ఆధారితంగా రన్ అవుతుంది. అడ్రినో GPUతో సపోర్టు చేస్తూ 12GB వరకు LPDDR5X ర్యామ్‌తో వస్తుంది. UFS 3.1 టెక్నాలజీతో గరిష్టంగా 256GB స్టోరేజీ సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఐక్యూ నియో 10ఆర్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో సోనీ నుంచి 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సీమోస్ సెన్సార్ సెల్ఫీలు, వీడియో కాల్స్ బెస్ట్ అని చెప్పవచ్చు.
కనెక్టివిటీ పరంగా చూస్తే.. ఐక్యూ నియో 10R 5G, వై-ఫై 7, బ్లూటూత్ 5.4తో పాటు GPS, GLONASS, GALILEO, BeiDou, NavIC, GNSS, QZSSకు సపోర్టు ఇస్తుంది. ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ వంటి వివిధ సెన్సార్‌లతో పాటు సేఫ్ అథెంటికేషన్ కోసం ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.
అదనంగా, బిల్డ్ వాటర్, డెస్ట్ నిరోధకతకు ఐపీ65 రేటింగ్‌ను కలిగి ఉంది. ఐక్యూ నియో 10ఆర్ 80డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 6,400mAh బ్యాటరీతో వస్తుంది. 75.88 x 163.72 x 7.98mm కొలతలు, సుమారు 196 గ్రాముల బరువు ఉంటుంది.