iQOO Neo 12 Launch : సూపర్ ఫోన్ బ్రో.. 9,000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ గేమింగ్ చిప్‌తో కొత్త ఐక్యూ నియో 12..

iQOO Neo 12 Launch : అక్టోబర్ 28న చైనాలో ఐక్యూ నియో 12 లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్, 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, గేమింగ్ కూలింగ్ సిస్టమ్ ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలివే..

iQOO Neo 12 Launch Date

  • 9,000mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్.. అక్టోబర్ 28నే లాంచ్
  • గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐక్యూ నియో 12 వచ్చేస్తోంది
  • స్నాప్‌డ్రాగన్ పవర్, భారీ బ్యాటరీ..  ఫీచర్లు ఇవే

iQOO Neo 12 Launch : గేమింగ్ ప్రియుల కోసం ఐక్యూ మరో కొత్త ఫోన్‌తో రెడీ అయింది. నెక్స్ట్ జనరేషన్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ నియో 12 లాంచ్ తేదీని చైనాలో ప్రకటించింది. లాంచ్ ముందే ఈ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ వెల్లడించింది. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, స్పెషల్ కూలింగ్ సిస్టమ్‌తో ఈ ఐక్యూ ఫోన్ టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది..

ఐక్యూ నియో 12 లాంచ్ ఎప్పుడంటే? :
అక్టోబర్ 28న చైనాలో ఐక్యూ నియో 12 లాంచ్ కానుంది. లోకల్ టైమ్ ప్రకారం.. రాత్రి 7 గంటలకు, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు లాంచ్ ఈవెంట్ జరగనుంది. ముగిసిన వెంటనే ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం వివో చైనా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ప్రీ-బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.

అదిరిపోయే డిజైన్.. 3 కలర్ ఆప్షన్లు :
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కాంటెస్ట్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ బ్లేడ్ బ్లూ కలర్ ఆప్షన్లలో కంపెనీ తీసుకొస్తోంది. ఇందులో స్పెషల్ టెక్స్చర్డ్ ఫినిషింగ్‌తో బ్యాక్ ప్యానెల్ ఆకట్టుకుంటోంది. ఈ డిజైన్ కోసం చైనా అకాడమీ ఆఫ్ ఆర్ట్‌తో ఐక్యూతో కలిసి పనిచేసింది. ఈ ఫోన్‌కు పాలిష్ చేసిన మెటల్ ఫ్రేమ్‌ను అందించారు.

Read Also : SBI 444 Days FD : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఈ బ్యాంకులో 444 రోజుల FDపై రూ. 10 లక్షలు పెడితే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

బ్యాక్ సైడ్ సర్కిల్ కార్నర్లతో రెక్టాంగిల్ కెమెరా మాడ్యూల్, రెండు కెమెరా లెన్స్‌లు, స్పెషల్ ఫ్లాష్ ఉండనున్నాయి. ఫ్రేమ్‌కు రైట్ సైడ్ ఎగ్జాస్ట్ వెంట్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన లైవ్ ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

గేమింగ్ కోసం పవర్‌ఫుల్ ఫీచర్లు :
ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు కంపెనీ సొంత క్యూ3 గేమింగ్ చిప్ ఉండనున్నట్లు సమాచారం. గేమింగ్ సమయంలో వేడిని తగ్గించేందుకు ఐస్ డోమ్ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్, ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్‌ను అందించనున్నట్లు వెల్లడైంది..

9,000mAh బ్యాటరీతో వస్తుందా? :
ఐక్యూ నియో 12లో భారీ 9,000mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు. అయితే, ఈ బ్యాటరీ సామర్థ్యం సహా కొన్ని స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. గత ఏడాది లాంచ్ అయిన ఐక్యూ నియో 11కు అప్‌గ్రేడ్ వెర్షన్ వస్తోంది. ఈ ఫోన్, గేమింగ్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందో తెలియాలంటే అధికారిక లాంచ్ వరకు వేచి చూడాల్సిందే..