iQoo Neo 6 Price in India ( Photo : Google)
iQoo Neo 6 Price in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఐక్యూ నియో 6 (iQoo Neo 6) ధర భారీగా తగ్గింది. భారత మార్కెట్లో ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.24,999కి పడిపోయింది. అలాగే, ఈ-కామర్స్ దిగ్గజం (Amazon)లో కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ (Oneline Store)లో 5,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ను కంపెనీ మే 2022లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ. 29,999లకు పొందవచ్చు.
బేస్ 8GB + 128GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ అందిస్తోంది. అదనంగా, యూజర్లు అమెజాన్ (Amazon) ద్వారా iQoo Neo 6 ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఎంపిక చేసిన ఫోన్ మోడల్‌లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.62-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లేను పొందవచ్చు. అమెజాన్‌లో ఐక్యూ నియో 6 హ్యాండ్‌సెట్ 128GB స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 24,999లకు తగ్గింది.
Read Also : iQoo 9 SE Price Cut : ఐక్యూ 9 SE ఫోన్ ధర తగ్గిందోచ్.. అద్భుతమైన ఫీచర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!
అమెజాన్ కస్టమర్‌లు ఈ హ్యాండ్‌సెట్ (8GB + 128GB RAM) స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 29,999కు పొందవచ్చు. ఎంపిక చేసిన ఫోన్ మోడల్‌లపై రూ. 22వేల వరకు తగ్గించే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ప్రకారం.. కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ కలిగిన ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. iQoo ఆన్‌లైన్ స్టోర్‌లో iQoo Neo 6 ధర కూడా తగ్గింది. ఇందులో ఈ ఫోన్ ధర రూ. 24,999గా ఉంది. కస్టమర్లు 12GB + 256GB వేరియంట్‌పై కూడా ఇలాంటి డిస్కౌంట్‌లను పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. రూ. 28,999 నుంచి అందుబాటులో ఉంది.
iQoo Neo 6 Price in India ( Photo : Google)
iQoo Neo 6 స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్-సిమ్ (Nano) iQoo Neo 6 ఫోన్ 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.62-అంగుళాల Full-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా ఆధారితమైనది. గరిష్టంగా 12GB RAMతో వచ్చింది. ఫొటోలు, వీడియోల కోసం.. iQoo Neo 6 అనేది f/1.89 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 64-MP Samsung ISOCELL GW1P ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్టు ఇస్తుంది. ప్రైమరీ కెమెరా f/2.2 ఎపర్చరు లెన్స్‌తో 8-MP వైడ్-యాంగిల్ కెమెరా, f/2.4 ఎపర్చరు లెన్స్‌తో 2-MP మాక్రో కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ సెల్ఫీలు, వీడియో చాట్‌లకు f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 16-MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వచ్చింది. ఆండ్రాయిడ్ 12-ఆధారిత Funtouch OS 12లో రన్ అవుతుంది. iQoo Neo 6 ఫోన్ 80W FlashCharge సపోర్టుతో 4,700mAh బ్యాటరీని అందిస్తుంది.