వార్నీ.. భలే ఉందిగా ఫోన్.. భారీ బ్యాటరీతో కొత్త ఐక్యూ 5G ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర..

iQOO Z10 5G Launch : వచ్చే ఏప్రిల్ 11న గ్లోబల్ మార్కెట్లోకి ఐక్యూ Z10 5G మిడ్-బడ్జెట్ ఫోన్ రానుంది. ఈ 5జీ ఫోన్ భారీ 7,300mAh బ్యాటరీతో వస్తుందని కంపెనీ వెల్లడించింది.

iQOO Z10 5G Launch

iQOO Z10 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అతిపెద్ద బ్యాటరీతో ఐక్యూ Z10 5G ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఐక్యూ నియో 10R రిలీజ్ చేయగా, కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ ఐక్యూ Z10 5G లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ ప్రకారం.. ఐక్యూ Z10 5G ఫోన్ ఏప్రిల్ 11న అధికారికంగా లాంచ్ కానుంది.

Read Also : Reliance Jio Offers : జియో యూజర్లకు పండగే.. 5 అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే..

లాంచ్‌కు ముందే కంపెనీ ఫోన్ కొన్ని కీలక స్పెక్స్‌లను కూడా వెల్లడించింది. ఉదాహరణకు.. ఐక్యూ Z10 5G ఫోన్ భారీ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. రాబోయే ఫోన్ ఇప్పటివరకు అతిపెద్ద బ్యాటరీగా కంపెనీ పేర్కొంది. ఐక్యూ Z10 5G లీకైన స్పెషిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఐక్యూ Z10 5G ఫీచర్లు లీక్ :
ఐక్యూ Z10 5G ఫోన్ ఆకట్టుకునే హార్డ్‌వేర్‌తో రానుంది. 7,300mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇప్పటివరకు ఈ స్మార్ట్‌ఫోన్‌లో చూడని అతిపెద్దది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. టీజర్ పరిశీలిస్తే.. ఐక్యూ ఫోన్ డిజైన్ రివీల్ చేసింది. ఐక్యూ Z10 5G బ్యాక్ ప్యానెల్‌లో సర్కిల్ ఐలాండ్ కలిగి ఉంది.

ఫ్లాష్ రింగ్‌తో 3-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్ రౌండెడ్ ఎడ్జ్‌లతో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. టీజర్‌లో కంపెనీ వైట్ కలర్ వేరియంట్‌ను మాత్రమే రివీల్ చేసింది. ఈ వేరియంట్ బ్యాక్ ప్యానెల్‌లో సిల్వర్ మెటల్ ఫ్రేమ్‌తో మార్బల్ ఆకృతిని కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.

గత లీక్‌ల ప్రకారం.. ఐక్యూ Z10 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 చిప్‌తో వస్తుందని భావిస్తున్నారు. 8GB లేదా 12GB RAM, 128GB లేదా 256GB స్టోరేజీ ఆప్షన్లు వచ్చాయి. బాక్స్ వెలుపల నేరుగా ఫన్‌టచ్ OS15పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను (24001080) రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్యానెల్ దాదాపు 2000 నిట్‌లకు చేరుకుంటుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే..
ఐక్యూ Z10 5Gలో 50MP సోనీ (IMX882) ప్రైమరీ సెన్సార్‌ను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో రావచ్చు. ఐక్యూ నియో 10Rలో మాదిరి సెటప్ ఉంటుంది. 2MP అసిస్ట్ లెన్స్, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. ఇతర ముఖ్య ఫీచర్లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్, స్లిమ్ 8.1mm ప్రొఫైల్, 195 గ్రాముల బరువు ఉండవచ్చు.

Read Also : Poco F7 Series : కొత్త పోకో F7 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ఈ నెల 27నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

పర్ఫార్మెన్స్, డిజైన్ రెండింటిలోనూ అద్భుతంగా ఉంటుందని స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు తెలిపింది. ఐక్యూ Z10 సిరీస్‌లో Pro, Z10x వేరియంట్ కూడా ఉంటుందని గతంలో పేర్కొంది. ఈ వేరియంట్ చైనాకు మాత్రమే ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి, కంపెనీ ఐక్యూ Z10 5జీ సింగిల్ మోడల్ మాత్రమే రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఐక్యూ Z10 5G భారత్ ధర (అంచనా) :
ఐక్యూ Z10 5జీ ఫోన్ ధర రూ.25వేల కన్నా చాలా తక్కువగా ఉండొచ్చు. కంపెనీ లాంచ్ తేదీని ఇంకా ధృవీకరించలేదు. హై-ఎండ్ మెమరీ, స్టోరేజ్ వేరియంట్ కూడా రూ.30వేల కన్నా తక్కువ ధరలో రావొచ్చు. అయితే, ఐక్యూ Z10 5G ఫోన్ ధర రూ.30వేలు దాటకపోవచ్చు. ఐక్యూ నియో 10R ప్రారంభ ధర రూ. 26,999, ఐక్యూ Z10 5G ధర అంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా.