iQOO Z10 Series
iQOO Z10 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ నుంచి సరికొత్త ఐక్యూ Z10 సిరీస్ వచ్చేస్తోంది. అతి త్వరలో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్‌లో బేస్, టర్బో, టర్బో ప్రో, Z10x వేరియంట్ ఉంటాయి.
ఇటీవలి లీక్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్‌ల కీలకమైన ఫీచర్లతో పాటు లాంచ్ టైమ్‌లైన్ గురించి అనేక వివరాలు లీక్ అయ్యాయి. స్టాండర్డ్, టర్బో వేరియంట్‌లు ఏప్రిల్‌లో లాంచ్ కావచ్చు. అయితే, ఐక్యూ Z10x ఈ ఏడాది 3వ త్రైమాసికంలో (Q3) ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మునుపటి ఐక్యూ Z9 ఫోన్ ఏప్రిల్ 2024లో చైనాలో ఆవిష్కరించింది.
ఐక్యూ Z10 సిరీస్ లాంచ్, ఫీచర్లు (అంచనా) :
వెయిబో పోస్ట్ ప్రకారం.. ఐక్యూ Z10 సిరీస్ ఏప్రిల్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బేస్ వేరియంట్ ఐక్యూ Z10 హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 4 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. 1.5K ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగి ఉంటుంది.
ఐక్యూ Z10 టర్బో, ఐక్యూ Z10 టర్బో ప్రో వేరియంట్‌లు వరుసగా మీడియాటెక్ డైమన్షిటీ 8400, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ ఎలైట్ చిప్‌సెట్‌లను పొందుతాయని భావిస్తున్నారు. ఐక్యూ Z10 టర్బో ఆప్షన్ 7,500mAh నుంచి 7,600mAh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది. 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. టర్బో ప్రో వెర్షన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది.
ఐక్యూ Z10x ఫోన్ 2025 మూడో త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుందని భావిస్తున్నారు. మోడల్ నంబర్ I2401 హ్యాండ్‌సెట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది.
త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. చైనాలో లాంచ్ అయ్యే ముందు భారత మార్కెట్లో ఐక్యూ Z10x లాంచ్ కావచ్చు. గత నివేదికల ప్రకారం.. ఐక్యూ Z10 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 15-ఆధారిత (OriginOS 5)తో రావచ్చునని సూచించాయి.
2024 ఏప్రిల్‌లో చైనాలో ఐక్యూ Z9 ఫోన్ ఐక్యూ Z9 టర్బో, ఐక్యూ Z9x ఫోన్లతో పాటు లాంచ్ అయింది. వెనిల్లా వెర్షన్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. అయితే, టర్బో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఐక్యూ Z9x స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీతో వస్తుంది. ఈ ఫోన్‌లు ఒక్కొక్కటి 6,000mAh బ్యాటరీతో 80W వరకు వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి.