Summer AC Offers : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీలపై 50 శాతం డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఏసీని కొని ఇంటికి తెచ్చుకోండి!

Summer AC Offers : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అయితే, వేసవికి ముందే మార్కెట్లో అనేక బ్రాండ్ల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి స్ప్లిట్ ఏసీల ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 50శాతం కన్నా ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

Summer AC Offers : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీలపై 50 శాతం డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఏసీని కొని ఇంటికి తెచ్చుకోండి!

Summer AC Offers

Updated On : March 11, 2025 / 3:57 PM IST

Summer AC Offers : వేసవి వచ్చేసింది. మార్చి చివరి నాటికి ఎండలు ఇంకా పెరగనున్నాయి. ఇప్పటికే పలు చోట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఇంట్లో క్షణం కూడా ఏసీ, కూలర్లు లేకుండా ఉండలేని పరిస్థితి. అందుకే చాలామంది మార్కెట్లో కొత్త ఏసీల కోసం చూస్తున్నారు.

ఈ వేసవిలో మీ ఇంటికి కొత్త ఏసీ కొని తీసుకురావాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం మార్కెట్లో బ్లూ స్టార్, వోల్టాస్, ఎల్‌‌జీ, శాంసంగ్ వంటి వివిధ రకాల బ్రాండెడ్ ఎయిర్ కండిషనర్లపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ సమయంలో తక్కువ ధరకు స్ప్లిట్ ఏసీలను కొనుగోలు చేసేందుకు అద్భుతమైన అవకాశం.

Read Also : Best Selling Laptops : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అమెజాన్‌లో టాప్ సెల్లింగ్ ల్యాప్‌టాప్స్ మీకోసం.. తక్కువ ధరకే కొనేసుకోండి..!

ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో స్ప్లిట్ ఏసీలు డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. మార్చి నుంచి ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇప్పుడు కస్టమర్లకు 50శాతం కన్నా ఎక్కువ సేవింగ్ చేసుకోవచ్చు. సరికొత్త స్ప్లిట్ ఏసీలను కొనుగోలు చేయొచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ద్వారా రియల్‌మి, హైయర్, డైకిన్, ఎల్‌జీ, స్మౌస్ంగ్, పానాసోనిక్, వోల్టాస్, బ్లూ స్టార్ వంటి తయారీదారుల నుంచి డిస్కౌంట్ ధరకు ఏసీలను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ నుంచి స్ప్లిట్ ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేసే కస్టమర్లు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు డబ్బు మరింత ఆదా చేసుకోవచ్చు.

ఎల్‌జీ 2025 మోడ్ ఏఐ స్ప్లిట్ ఏసీ :
ఈ ఎల్‌జీ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ మోడల్ నంబర్ (US-Q18JNXE) వేగంగా కూలింగ్ అవుతుంది. డ్యూయల్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ కలిగి ఉంది. ఈ ఏసీకి 3 స్టార్ రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్ప్లిట్ ఏసీ అసలు ధర రూ.78,990 ఉండగా 52శాతం తగ్గింపుతో అమ్మకానికి ఉంది. ప్రస్తుత డిస్కౌంట్‌లతో ఈ ఏసీని కేవలం రూ.37,690కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా, మీరు రూ.5400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.

వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ :
ఈ వోల్టాస్ స్ప్లిట్ ఏసీ మోడల్ నంబర్ 183V CAX (4503692). ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీ ధర రూ. 62,990కు లభ్యమవుతుంది. కానీ, ప్రస్తుతం వినియోగదారులకు భారీ 46శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపు తర్వాత మీరు కేవలం రూ. 33,990కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ డీల్‌లో మీరు రూ. 5400 వరకు ఆదా చేసుకునే అవకాశం కూడా ఉంది.

రియల్‌‌మి టెక్‌లైఫ్ 2025 1.5 టన్ స్ప్లిట్ ఏసీ :
రియల్‌మి స్ప్లిట్ ఎయిర్ కండిషనర్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. రియల్‌మి స్ప్లిట్ ఏసీ మోడల్ నంబర్ (155IPG25WRS). ఫ్లిప్‌కార్ట్‌లో అసలు ధర రూ. 66,999 ఉండగా, ఈ ఎయిర్ కండిషనర్‌కు 5-స్టార్ రేటింగ్ ఉంది. కానీ, ఇప్పుడు 50శాతం తగ్గింపుతో కేవలం రూ. 32,990 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీరు ఎక్కువ డబ్బు ఆదా చేయొచ్చు.

డైకిన్ 3-స్టార్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ :
ప్రస్తుత మార్కెట్‌లో డాకిన్ స్ప్లిట్ ఏసీ బాగా పాపులర్. MTKL50UV16V3, RKL50UV16V అనే రెండు డైకిన్ స్ప్లిట్ ఏసీలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్‌ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. డైకిన్ 1.5-టన్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ధర రూ. 58,400గా ఉంది. ప్రస్తుతం ఈ ఏసీపై 36శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తర్వాత మీరు కేవలం రూ. 36,990 వద్ద కొనుగోలు చేయవచ్చు.

బ్లూ స్టార్ 3-స్టార్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ :
బ్లూ స్టార్ ఎయిర్ కండిషనర్లు భారీ తగ్గింపుతో అమ్మకానికి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బ్లూ స్టార్ (ID318YKU) స్ప్లిట్ ఏసీ మోడల్ నంబర్‌పై 41శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఎయిర్ కండిషనర్ ధర రూ. 61,250 అయినప్పటికీ, కేవలం రూ. 35,990కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : FD Interest Rates : మీరు FDలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీ వడ్డీ అందించే బ్యాంకులివే..!

గోద్రేజ్ కన్వర్టిబుల్ స్ప్లిట్ ఏసీ 5-ఇన్-1 :
గోద్రెజ్ బ్రాండ్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ గోద్రెజ్ ఎయిర్ కండిషనర్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. గోద్రెజ్ (EI 18PINV4R32) స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ నాలుగు-వైపుల ఎయిర్ స్వింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

ప్రస్తుతం ఈ ఏసీ ధర రూ. 49,900కు లభ్యమవుతుంది. కానీ, ప్రస్తుతం ఏసీలపై 30శాతం తగ్గింపు అందిస్తోంది. మీరు ఈ డీల్‌తో కేవలం రూ. 34,490కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మీరు అదనంగా రూ. 4వేలు ఆదా చేయొచ్చు.