FD Interest Rates : మీరు FDలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీ వడ్డీ అందించే బ్యాంకులివే..!

FD Interest Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

FD Interest Rates : మీరు FDలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీ వడ్డీ అందించే బ్యాంకులివే..!

FD Interest Rates

Updated On : March 11, 2025 / 3:12 PM IST

FD Interest Rates : మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మార్కెట్లో అనేక బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక వడ్డీలను అందిస్తున్నాయి. మీరు ఏ బ్యాంకులోనైనా ఎఫ్ చేయాలని భావిస్తే ముందుగా ఆయా బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఒకదానితో మరొకటి పోల్చి చూడండి.

ఎందులో ఎక్కువ తక్కువ అనేది తెలుస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఈ విషయం తెలుసుకోవడం చాలా అవసరం. పెట్టుబడిదారులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకులో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.

Read Also : iPhone 16 Pro Max : ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ‘శాటిలైట్ కాలింగ్’తో ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. గెట్ రెడీ..!

అయితే, సాధారణంగా దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు లభిస్తాయి. కానీ, 3 ఏళ్ల ఎఫ్‌డీలపై మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తున్న 7 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఫిక్స్‌డ్‌లో పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ రేట్లలో 50 బేసిస్ పాయింట్లతో దీర్ఘకాలంలో సేవింగ్స్ పెంచుతుంది. ఉదాహరణకు.. బ్యాంకులు రూ. 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని అందిస్తే.. 3 ఏళ్లలో రూ. 15వేలు రాబడి అందిస్తాయి. ఈ 7 బ్యాంకులు అత్యధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.. ఏయే బ్యాంకులు ఉన్నాయంటే?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ :
ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు 3 ఏళ్ల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ రేట్లు, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్ :
ఈ బ్యాంక్ 3 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ :
ఈ బ్యాంక్ 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని అందిస్తుంది.

ఫెడరల్ బ్యాంక్ :
ఈ బ్యాంక్ 3 ఏళ్ల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని ఇస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) :
భారత అతిపెద్ద బ్యాంకు సాధారణ పౌరులకు 6.75 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీని అందిస్తోంది.

Read Also : Best Selling Laptops : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అమెజాన్‌లో టాప్ సెల్లింగ్ ల్యాప్‌టాప్స్ మీకోసం.. తక్కువ ధరకే కొనేసుకోండి..!

బ్యాంక్ ఆఫ్ బరోడా :
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు 7.15 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీని అందిస్తుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు 6.7 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.2 శాతం వడ్డీని అందిస్తుంది.