శాటిలైట్ కాలింగ్ తో ఐఫోన్ వచ్చేస్తోంది.. గెట్ రెడీ
iPhone 16 Pro Max : ఆపిల్ కొత్త ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి శాటిలైట్ కాలింగ్ ఫీచర్ ఉండనుంది. మిగతా ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

iPhone 16 Pro Max
iPhone 16 Pro Max : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి టెక్నాలజీ ప్రపంచంలో సంచలనం సృష్టించనుంది. గ్లోబల్ మార్కెట్లోకి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రో మ్యాక్స్ గురించి అనేక పుకార్లు, ఊహాగానాలు వస్తున్నాయి.
ఆపిల్ ఇంకా అధికారికంగా ఈ ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ లాంచ్ చేయలేదు. కానీ, ముందే లీకైన నివేదికలు మరింత హైప్ తీసుకువస్తున్నాయి. టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం.. ఈ ఫోన్ సెప్టెంబర్ 2025లో లాంచ్ కానుంది. రాబోయే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో ఏయే ఫీచర్లు ఉండనున్నాయో పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
డిజైన్, డిస్‌ప్లే :
ఆపిల్ ఈ ఏడాదిలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిజైన్‌లో భారీ మార్పు చేయనుంది. 6.9-అంగుళాల సూపర్ రెటినా (XDR OLED) డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆపిల్ ఐఫోన్లలో ఇదే అతిపెద్ద ఐఫోన్ డిస్‌ప్లే కావచ్చు. సన్నని బెజెల్స్, టైటానియం ఫ్రేమ్ మరింత ప్రీమియం లుక్‌ను అందించనుంది.
ఆపిల్ కొత్త A18 ప్రో చిప్‌సెట్ కూడా ఈ ఐఫోన్‌లో ఉండనుంది. ఈ చిప్ 3nm టెక్నాలజీపై ఆధారపడి రన్ అవుతుంది. ఐఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా స్పీడ్ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఏఐ ఫీచర్ల కోసం న్యూరల్ ఇంజిన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
కెమెరా సెటప్ :
ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లోని కెమెరా సెటప్ మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. నివేదికల ప్రకారం.. 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కొత్త పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉండవచ్చు. 5X నుంచి 10X ఆప్టికల్ జూమ్‌కు సపోర్టు ఇస్తుంది. అలాగే, ఆపిల్ ఈసారి తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ, వీడియో క్వాలిటీని మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తోంది.
బ్యాటరీ, ఛార్జింగ్ :
బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే.. దాదాపు 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనా. అలాగే వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్, మ్యాగ్‌సేఫ్ సపోర్టు కూడా గత సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కన్నా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మాక్స్ బ్యాటరీ లైఫ్ ఇప్పటివరకు ఉన్న అన్ని ఐఫోన్‌లలో కన్నా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పవచ్చు.
ఇతర స్పెషల్ ఫీచర్లు (అంచనా) :
- iOS 19 ఆపరేటింగ్ సిస్టమ్
- USB టైప్-C పోర్ట్ (USB-C పోర్ట్)
- అప్‌గ్రేడ్ టచ్ రెస్పాన్స్, కొత్త యాక్షన్ బటన్
- శాటిలైట్ కాలింగ్ ఫీచర్ అప్‌గ్రేడ్
- భారతదేశంలో ధర (అంచనా)
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర 1,59,900 నుంచి అందుబాటులో ఉండనుంది. కానీ ఈ ఐఫోన్ కచ్చితమైన ధరను కంపెనీ రివీల్ చేయలేదు. ఆపిల్ ప్రీమియం లైనప్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ధర కూడా భారీగానే ఉంటుందని చెప్పవచ్చు.