రైల్వే బుకింగ్స్ పై 10శాతం క్యాష్ బ్యాగ్ ఆఫర్

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 12:20 PM IST
రైల్వే బుకింగ్స్ పై 10శాతం క్యాష్ బ్యాగ్ ఆఫర్

Updated On : December 30, 2019 / 12:20 PM IST

ప్రభుత్వ రంగ సంస్థ అయిన SBI బ్యాంక్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) కలిసి తమ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించినది.ఈ రెండు సంస్ధలు కలిసి తమ కస్టమర్లకు SBI ప్రీమియర్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది.

ఈ కార్డు తీసుకున్న కస్టమర్లకు  రూ.2 వేల బోనస్ పాయింట్లు,బుక్ మై షో టిక్కెట్లు, తొలి సంవత్సరంలో యాన్యువల్ ఫీజు చెల్లించినప్పుడు రూ.1500 లేదా 1500 బోనస్ పాయింట్లు వస్తాయి.

> మెుదటి 60 రోజుల్లో రూ.2 వేల  ఖర్చు చేస్తే బుక్ మై షో యాప్ ద్వారా రూ.500 మూవీ వోచర్లు లభిస్తాయి. అంతేకాకుండా బోనస్ పాయింట్లు 45 రోజుల్లో అకౌంట్లోకి వస్తాయి.

> రైలు ప్రయాణంలో  www.irctc.co.in ద్వారా AC1, AC2, AC3, AC CC రైళ్లలో టికెట్టు బుక్ చేసుకుంటే 10 శాతం క్యాష్ బ్యాక్  వస్తుంది. అంతేకాకుండా ఎయిర్ టిక్కెట్, ఐఆర్ సిటిసి క్యాటరింగ్ లో భోజనం కొనుగోలు చేసినప్పుడు 5 శాతం క్యాష్ బ్యాగ్ వస్తుంది.

> ఏడాదిలో ట్రావెల్ ఖర్చులు రూ.50వేలు దాటితే రూ.2వేల 500,రూ.5వేల బోనస్ పాయింట్స్ వస్తాయి.

> IRCTC వెబ్ సైట్ ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటే పేమెంట్ గేట్ వే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా 1.8 శాతం లావా దేవి ఛార్జీలు,జీరో పేమెంట్ గేట్ వే ఛార్జీలను అందిస్తుంది.

> కాంప్లిమెంటరీ రైల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ .10 లక్షలు, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ .50 లక్షలు, ఫ్రాడ్ లయబులిటీ కవర్ రూ.1 లక్ష వరకు లభిస్తుంది.

> జాయినింగ్ ఫీజు రూ. 1499 ఉంటుంది. ప్రతి సంవత్సరం చెల్లించవల్సిన అవసరం లేదు.