×
Ad

Fake GST Notices : మీకు GST నోటీసు వచ్చిందా? అది ఫేక్ నోటీసా కాదా? జస్ట్ 30 సెకన్లలో తెలుసుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Fake GST Notices : మీకు జీఎస్టీ GST నోటీసులు వచ్చాయా? అది సైబర్ నేరగాళ్ల పనే కావొచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) దీనికి సంబంధించి అవగాహన కల్పిస్తోంది. ఓసారి లుక్కేయండి.

Fake GST Notices (Image Credit To Original Source)

  • ఫేక్ జీఎస్టీ నోటీసుల ద్వారా పెరుగుతున్న సైబర్ మోసాలు
  • CBIC పోర్టల్‌లోని DIN నుంచి నోటీసు అథెంటికేషన్ వెరిఫై చేయండి
  • మీకు ఫేక్ నోటీసు అందితే వెంటనే సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయండి

Fake GST Notices : స్కామర్లతో జర జాగ్రత్త.. ఈరోజుల్లో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకోలేని పరిస్థితి. ముఖ్యంగా అనేక చిన్నపాటి వ్యాపారులు డిజిటల్ మోసాలకు గురవుతున్నాయి.

సైబర్ మోసగాళ్ళు దుకాణదారులకు చిన్న వ్యాపారులకు ఫేక్ జీఎస్టీ నోటీసులు పంపడం ద్వారా లక్షల రూపాయలను కాజేసిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. మీకు కూడా ఇలాంటి ఫేక్ జీఎస్టీ నోటీసు ఒకవేళ అందితే కంగారుపడకండి. ముందుగా మీకు వచ్చిన జీఎస్టీ నోటీసు రియల్ లేదా ఫేక్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇంతకీ, జీఎస్టీ నోటీసును ఎలా వెరిఫై చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మీకు వచ్చిన జీఎస్టీ నోటీసు ఫేక్ లేదా రియలా అని మీరు ఎలా వెరిఫై చేసుకోవాలో వివరిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Read Also : Suzuki e-Access : మహిళల కోసం సుజుకి ఫస్ట్ ‘ఇ-యాక్సెస్’ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 95 కి.మీ రేంజ్.. మీ బడ్జెట్ ధరలోనే..!

ఫేక్ జీఎస్టీ నోటీసులతో సైబర్ మోసాలు :
చిన్న వ్యాపారులను బెదిరించి మోసం చేసేందుకు స్కామర్లు ఫేక్ జీఎస్టీ నోటీసులను పంపుతారు. మీకు పంపిన ఫేక్ నోటీసులు జీఎస్టీ డిపార్ట్ మెంట్ మాదిరిగానే కనిపించేలా ఉంటాయి. అదే లోగోతో వస్తాయి. ఇంకా, స్కామర్లు నోటీసులపై ఫేక్ DIN నంబర్‌ కూడా ఉపయోగిస్తారు. ఆ నోటీసు రియల్ లేదా ఫేక్ అని నిర్ణయించడానికి మీరు ఈ నంబర్‌ను ఉపయోగించవచ్చు.

Fake GST Notices (Image Credit To Original Source)

జీఎస్టీ నోటీసు నకిలీదో కాదో తెలుసుకునేందుకు మీరు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి వెరిఫై చేసుకోవాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (DIN)ని చెక్ చేయండి.

జీఎస్టీ నోటీసు ఫేక్ లేదా ఒరిజినల్ 30 సెకన్లలో తెలుసుకోవచ్చు :

డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (DIN) అనేది ప్రతి అధికారిక కమ్యూనికేషన్ కోసం GST డిపార్ట్మెంట్ జారీ చేసే స్పెషల్ ఐడీ నంబర్. DIN యుటిలిటీ సెర్చ్ ఉపయోగించి జీఎస్టీ డిపార్ట్ మెంట్ నుంచి పంపినా ఏదైనా కమ్యూనికేషన్ నిజమా కాదా? చెక్ చేయొచ్చు. ఈ కింది విధంగా ప్రయత్నంచండి.

  • ఫస్ట్ మీ డాక్యుమెంట్‌లోని DIN కోడ్ గుర్తించండి.
  • సాధారణంగా కమ్యూనికేషన్‌లో “CBIC-YYYY MM ZCDR NNNN” ఫార్మాట్‌లో ఉంటుంది.
  • మీ DIN పొందాక అధికారిక CBIC పోర్టల్‌ను విజిట్ చేయండి.
  • ‘Oneline Services’ ట్యాబ్ కింద ‘Verify CBIC DIN GST’ ఆప్షన్ క్లిక్ చేయండి.
  • మీకు వచ్చిన DIN నంబర్‌ను DIN ఫీల్డ్‌లో ఎంటర్ చేయండి.
  • ‘Submit’ బటన్‌ను ట్యాప్ చేయండి.
  • ఈ ఫీచర్ డాక్యుమెంట్ రియలా లేదా ఫేక్ అనేది మెసేజ్ కనిపిస్తుంది.
  • మీకు కన్ఫార్మ్ మెసేజ్ కనిపించకపోతే.. వెంటనే సైబర్ సెల్‌కు రిపోర్టు చేయండి.
  • మీరు నేరుగా 1030కు కాల్ చేసి కూడా రిపోర్టు చేయొచ్చు.