Is your phone slowing down_ here's how to speed up your smartphone
How To Speed Up Smartphone : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smartphones) లేకుండా ఊహించుకోలేని పరిస్థితి. నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఒక క్షణం కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. అయితే గంటలకొద్ది స్మార్ట్ ఫోన్ వాడటం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఫోన్ కాల్ చేయడం నుంచి ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ (internet surfing) చేయడం, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం వరకు స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే.
కానీ, అధికంగా ఫోన్ వినియోగంతో పాటు ఫొటోలు, వీడియోలను డౌన్‌లోడ్ చేస్తుంటారు. తద్వారా స్మార్ట్‌ఫోన్‌లు తరచుగా నెమ్మదిస్తుంటాయి. కొన్నిసార్లు స్మార్ట్ ఫోన్లు స్టక్ అయి పనిచేయకుండా ఆగిపోతాయి. మీరు కూడా మీ స్మార్ట్ ఫోన్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే, మీ స్మార్ట్‌ఫోన్ ఇలా స్పీడ్ పెంచుకోవచ్చు. మీ డివైజ్ స్పీడ్, పర్ఫార్మెన్స్ పెంచుకునేందుకు కొన్ని టిప్స్ మీకోసం అందిస్తున్నాం.
Is your phone slowing down_ here’s how to speed up your smartphone
ఫోన్ కాష్ డేటా డిలీట్ చేయండి (Delete Phone Cache Data) :
మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రతిదీ స్టోర్ అవుతుంది. RAMలో Cache ఎక్కువగా స్టోర్ అవుతుంది. ఉదాహరణకు.. మీరు వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే.. మీ ఫోన్ కొంత డేటాను Save చేస్తుంది. తద్వారా మరోసారి అదే వెబ్‌సైట్ url వేగంగా లోడ్ అవుతుంది. అయితే కొన్నిసార్లు గ్యాలరీలో కనిపించని డేటా మీ ఫోన్‌లో చాలా మెమెరీని మింగేస్తుంది. మీరు చేయాల్సిందల్లా Cache లేదా Zunk ఫైల్‌లను క్లియర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్‌లోని (Cache Data) డేటాను ఇలా క్లియర్ చేయండి. Settings > Storage > Cache > Clear Cache ఆప్షన్ ఎంచుకోండి > Confirm చేయండి. ఈ పద్ధతిలో మీ డివైజ్‌లో కొంత RAMని క్లియర్ అవుతుంది. దాంతో మీ ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.
Delete bloatware and unused apps :
ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం దగ్గర నుంచి మీ ఫోన్‌లో ఫోటోలను ఎడిట్ చేసేందుకు తరచుగా అనేక యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తుంటారు. మీ ఫోన్‌లో అవసరం లేని యాప్‌లు ఉంటే మీ డివైజ్ నెమ్మదించవచ్చు. మీ ఫోన్ స్పీడ్ పెంచేందుకు ఆయా యాప్స్ వెంటనే డిలీట్ చేయడం మంచిది. మీరు యాప్‌ని Uninstal చేయలేకపోతే.. దాన్ని డిసేబుల్ చేయండి. అలా చేసేందుకు Settings > Apps ఆప్షన్‌తో పాటు Program> మీరు డిసేబుల్ చేసే Appను ఓపెన్ చేయండి> Disable ఆప్షన్ క్లిక్ చేయండి.
Is your phone slowing down_ here’s how to speed up your smartphone
Update to Latest software :
మీరు ఆండ్రాయిడ్ (Android) లేదా iOS (ఐఫోన్) అయినా కావొచ్చు. ఆయా కంపెనీలు తమ ఫోన్లను స్పీడ్‌గా పనిచేసేందుకు ఏవైనా బగ్‌లను ఉంటే తొలగిస్తాయి. అయితే ఈ బగ్స్ ఫిక్స్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్‌ల (Operating System) కోసం క్రమం తప్పకుండా Updates రిలీజ్ చేస్తాయి. మీ ఫోన్‌లో Latest Update చూసిన తర్వాత సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేయాలి. లేదంటే మీ ఫోన్ స్లో కావడానికి ఇదే కారణం కావచ్చు. మీ ఫోన్‌ని WiFiతో కనెక్ట్ చేయండి. Settings > Phone లేదా System Updates గురించి ఓపెన్ చేయండి> Updates కోసం Search చేయండి. ఆ తర్వాత ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.
Use Liter Edition Apps :
మీరు పాత స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? లో-ఎండ్ ఫోన్‌ని వాడుతున్నారా? అయితే భారీ-సైజు యాప్‌లతో మీ ఫోన్ స్టోరేజీ, పర్ఫార్మెన్స్‌పై ప్రభావం చూపుతాయి. మీరు చేయాల్సిందల్లా ఈ యాప్‌ల లైటర్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది. Facebook Lite, ఇన్‌స్టాగ్రామ్ లైట్ (Instagram Lite), Google Go వంటి కొన్ని తేలికపాటి వెర్షన్‌లను వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌లు తక్కువ మెమరీని తీసుకుంటాయి. ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీరు యాప్ స్టోర్ (App Store)కి వెళ్లి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
Is your phone slowing down_ here’s how to speed up your smartphone
Turn off or Reduce Animations :
మీ స్మార్ట్‌ఫోన్ స్పీడ్ పెరగాలంటే యానిమేషన్‌లను తగ్గించడం ఒక్కటే దారి. మీ డివైజ్‌లో డెవలపర్ ఆప్షన్లను ఆన్ చేసుకోవాలి. Settings > About Phone> Build Number అనే ఆప్షన్‌పై 7 సార్లు నొక్కండి. ఈ ప్రక్రియ మీ డివైజ్‌లో Developer Option కనిపించే వరకు చేయాలి. ఇప్పుడు మీకు డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు అక్కడ యానిమేషన్ (Animations)లను Stop చేయవచ్చు లేదా Reduce చేయవచ్చు. మీరు విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ యానిమేటర్ వ్యవధి స్కేల్‌ను కూడా అడ్జెస్ట్ చేయవచ్చు. ఈ పద్ధతి స్క్రీన్ విజువల్ ఎఫెక్ట్‌లను కూడా తగ్గిస్తుంది.