Apple Watch : 54 ఏళ్ల వ్యక్తి లైఫ్ మళ్లీ కాపాడిన ఆపిల్ వాచ్.. భార్య ఇచ్చిన గిఫ్ట్ వేలసార్లు అతన్ని కాపాడింది..!

Apple Watch : ఆపిల్ వాచ్ మరోసారి 54ఏళ్ల వ్యక్తి జీవితాన్ని కాపాడింది. ఆపిల్ స్మార్ట్ వాచ్‌ (Apple Smart Watch)లోని ECG సెన్సార్ అతన్ని ప్రతిసారి కాపాడుతూ వస్తోంది. ఆ వ్యక్తి హృదయ స్పందన రేటును గుర్తించిన వెంటనే అతడు ధరించిన ఆపిల్ వాచ్ ప్రాణాలను కాపాడింది.

Apple Watch : 54 ఏళ్ల వ్యక్తి లైఫ్ మళ్లీ కాపాడిన ఆపిల్ వాచ్.. భార్య ఇచ్చిన గిఫ్ట్ వేలసార్లు అతన్ని కాపాడింది..!

Apple Watch saves life of a 54 years old man this time, warns him of abnormal heart rate

Apple Watch : ఆపిల్ వాచ్ మరోసారి 54ఏళ్ల వ్యక్తి జీవితాన్ని కాపాడింది. ఆపిల్ స్మార్ట్ వాచ్‌ (Apple Smart Watch)లోని ECG సెన్సార్ అతన్ని ప్రతిసారి కాపాడుతూ వస్తోంది. ఆ వ్యక్తి హృదయ స్పందన రేటును గుర్తించిన వెంటనే అతడు ధరించిన ఆపిల్ వాచ్ ప్రాణాలను కాపాడింది. యూకేలో ఆపిల్ వాచ్ యూకే ఆధారిత వ్యక్తి జీవితాన్ని ఒకటి లేదా రెండుసార్లు కాదు.. 3,000 కంటే ఎక్కువ సార్లు రక్షించింది. అవును, మీరు విన్నది నిజమే. ECG హార్ట్ సెన్సార్ దాదాపు 3,000 సార్లు హృదయ స్పందన తక్కువగా ఉన్నప్పుడుల్లా అలర్ట్ పంపింది. తద్వారా అతడి ప్రాణాలను కాపాడిందని చెప్పాడు.

నివేదిక ప్రకారం.. 54 ఏళ్ల వ్యక్తి, డేవిడ్ లాస్ట్‌కు తన భార్య బహుమతిగా ఇచ్చిన ఆపిల్ వాచ్ నుంచి అనేకసార్లు వార్నింగ్ అలర్ట్ రావడంతో అతడు వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అనేక వైద్య పరీక్షల తర్వాత.. అతనికి గుండె సమస్య ఉందని తెలిసి ఆశ్చర్యపోయాడు. నివేదిక ప్రకారం.. ఆపిల్ వాచ్‌ ద్వారా వ్యక్తి హృదయ స్పందన నిమిషానికి 30 బీట్‌ల కన్నా తక్కువకు పడిపోయినట్లు గుర్తించాడు (సాధారణ హృదయ స్పందన రేటు 60-100bpm మధ్య ఉండాలి). హృదయ స్పందన రేటు చాలాసార్లు క్షీణించడంతో అతని భార్య ఆపిల్ వాచ్ చెక్ చేయమని కోరింది. ECG, MRI, ఇతర టెస్టులు నిర్వహించిన 48 గంటల పరీక్ష వ్యవధిలో 10 సెకన్లలో అతని హృదయ స్పందన రేటు 138 సార్లు తగ్గిందని తేలింది.

Apple Watch saves life of a 54 years old man this time, warns him of abnormal heart rate

Apple Watch saves life of a 54 years old man this time, warns him of abnormal heart rate

గుండెనొప్పి వచ్చిందని, వెంటనే అతడికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అతనికి ఆపరేషన్ పూర్తి చేశారు. అసాధారణమైన గుండె స్పందన గుర్తించడానికి పేస్‌మేకర్‌ని అమర్చారు. ఇప్పుడు అతడు సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నాడు. అతని ప్రాణాలను కాపాడినందుకు Apple వాచ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతని పుట్టినరోజు సందర్భంగా భార్య ఆపిల్ వాచ్‌ (Apple Smart Watch)ను బహుమతిగా ఇచ్చింది. తన పుట్టినరోజు కోసం భార్య ఆపిల్ వాచ్‌ని కొనుగోలు చేయకపోతే నేను బతికి ఉండేవాడిని కాదని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తన భార్యకు ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటానని తెలిపాడు.

Apple Watch saves life of a 54 years old man this time, warns him of abnormal heart rate

Apple Watch saves life of a 54 years old man this time, warns him of abnormal heart rate

ఆపిల్ వాచ్ ఛార్జ్ చేయడమే కాదు.. అది ఎల్లప్పుడూ తన చేతికే ఉంటుందని తెలిపాడు. ఆపిల్ వాచ్ ఒకరి ప్రాణాలను కాపాడటం ఇదే మొదటిసారి కాదు. వివిధ సందర్భాల్లో Apple Watch చాలామందిలో BP లేదా హృదయ స్పందన రేటుపై హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జీవితాలను రక్షించింది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం వాచ్ సిరీస్ 8 (Apple Watch Series 8) , Watch SE 2, ఆపిల్ వాచ్ ప్రో (Apple Watch Pro)తో సహా ఈ వారం కొత్త ఆపిల్ వాచ్‌లను లాంచ్ చేయనుంది. ఈ ఆపిల్ వాచ్‌లలో హెల్త్ ఫిట్‌నెస్ ఫీచర్‌లతోనే ఎక్కువగా రానున్నాయి.

Read Also : Apple Watch : ఈ ఆపిల్ వాచ్.. మీ హార్ట్‌బీట్‌లో తేడా ఉన్నా చెప్పేస్తుంది.. డెడ్లీ ట్యూమర్లను పసిగట్టేస్తుంది!