IT Female Employees : వర్క్ ఫ్రమ్ హోం మాకొద్దు.. ఐటీ జాబ్స్ వదిలేస్తున్న మహిళలు…!

IT Female Employees : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా అన్నిరంగాలపై తీవ్రప్రభావం పడింది. కరోనాతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అనుమతినిచ్చాయి.

IT Female Employees : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా అన్నిరంగాలపై తీవ్రప్రభావం పడింది. కరోనా తీవ్రత కారణంగా చాలావరకూ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చాయి. ఇప్పటికీ చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ కొనసాగిస్తూనే ఉన్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మెల్లగా ఐటీ ఉద్యోగులు సైతం ఆఫీసుల బాట పడుతున్నారు. కరోనా పుణ్యామని మానవ జీవన విధానమే మారిపోయింది.. కరోనాకు ముందు.. కరోనా తర్వాత అనే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ కంపెనీల్లో మహిళా ఉద్యోగులు ఈ వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటూ మరోవైపు ఆఫీసు వర్క్ చేయడం ఇలా అనేక టాస్క్‌లు చేయాల్సి రావడంతో మానసికంగా తీవ్ర ప్రభావం పడుతోంది.

Pandemic Induced Wfh Reduced Number Of Females Quitting It Sector Survey

వర్క్ ఫ్రమ్ హోం కన్నా ఆఫీసు వర్క్ ఎంతో మేలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆఫీసు వర్క్ చేసే పరిస్థితి లేని ఐటీ కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఏకంగా తమ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోంకు ఒక దండం అనే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా ఐటీ మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయలేం మహాప్రభో అనేయడంతో ఐటీ కంపెనీలు గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్లాయి. కొత్త ఉద్యోగుల నియామకంపై కంపెనీలకు కష్టంగా మారింది. ఓ నివేదిక ప్రకారం.. 2020తో పోలిస్తే.. 2021 జనవరి – జూన్‌ మధ్య కాలంలో ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్న మహిళలు తమ ఉద్యోగాల్ని వదిలేసినట్లు ఓ సర్వే వెల్లడించింది.

వారిలో 40శాతం నాన్‌ మేనేజిరియల్‌ లెవల్‌, 20శాతం మేనేజిరియల్‌, కార్పోరేట్‌ ఎగ్జిగ్యూటీవ్‌ లెవల్‌ ఉద్యోగులే ఉన్నారని సర్వేలో తేలింది. అవతార్‌ సీరమౌంట్‌ సంస్థలు బెస్ట్‌ కంపెనీస్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ ఇండియా రిపోర్ట్‌-2021 కింద ఈ సర్వేను చేపట్టాయి. ఇందులోIT/ITES సెక్టార్‌లలో అట్రిషన్‌ రేటు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.  2016 ఐటీ విభాగంలో 10శాతం మహిళా ఉద్యోగులు పెరిగారు. అయితే 2021 నాటికి ఐటీ కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 34.5శాతంగా ఉంది. 2020 -2021 మధ్యకాలంలో మహిళ ఉద్యోగుల శాతం 4.34గా నమోదు కావడం ఐటీ రంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

IT/ITES విభాగంలో మహిళల ప్రాధాన్యం 2020లో 31 శాతం ఉండగా 2021లో 32.3శాతానికి పెరిగింది. మేనేజిరియల్‌ లెవల్స్‌ 2020లో 19శాతం నుంచి 2021 ఏడాదిలో 21శాతానికి పెరిగింది. సర్వే నిర్వహించిన అవతార్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఇంట్లో పనితో పాటు ఆఫీసు వర్క్ కూడా ఇంట్లోనే చేయాల్సి రావడంతో పని ఒత్తిడి కారణంగా చాలామంది ఐటీ మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రిజైన్ చేస్తున్నట్టు తెలిపారు. మహిళా ఉద్యోగులు ఆఫీస్‌కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలంటే ఇంట్లో శారీరకంగా, మానసికంగా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది.

అందుకే ఐటీ మహిళా ఉద్యోగులు తమ ఆందోళనను తగ్గించుకునేందుకు ఉద్యోగాలను వదులుకుంటున్నట్టు పేర్కొన్నారు. కరోనా కారణంగా పనిచేసే విధానంలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. కానీ, అట్రిషన్ రేటు మాత్రం చాలా తగ్గిపోయిందని తెలిపారు. ఇన్నిరోజులు ఇంట్లోనే ఉండి ఆఫీసు వర్క్ చేసిన మహిళలు.. తిరిగి ఆఫీసులకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. ఆఫీసుల్లో మునుపటిలా ఉద్యోగం చేయాలనే ఆలోచన వారిలో తగ్గిపోయినట్టు గుర్తించామని తెలిపారు.

Read Also : No Work From Home:వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు.. ఆఫీసులకు రావల్సిందే.. కేంద్రం ఆదేశాలు!

ట్రెండింగ్ వార్తలు