No Work From Home:వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు.. ఆఫీసులకు రావల్సిందే.. కేంద్రం ఆదేశాలు!

ఒమిక్రాన్ కొత్త వేరియంట్, కరోనా కేసులు పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా.. దాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

No Work From Home:వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు.. ఆఫీసులకు రావల్సిందే.. కేంద్రం ఆదేశాలు!

Work From Home

No Work From Home: ఒమిక్రాన్ కొత్త వేరియంట్, కరోనా కేసులు పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా.. దాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మూడో వేవ్ కారణంగా పెరిగిన కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని శాఖల్లోనూ ఉద్యోగులు విధిగా ఆఫీసులకు రావాలని ఆదేశించింది కేంద్రం.

ఇవాళ(7 ఫిబ్రవరి 2022) నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ 100 శాతం హాజరుతో పనిచేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) ద్వారా మెమోరాండం జారీ చేశారు యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్. ఢిల్లీలో కొత్త కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కనిపించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేసింది ప్రభుత్వం.

ఢిల్లీ సహా దేశమంతటా కొవిడ్ పరిస్థితులు మెరుగుపడిన క్రమంలో 100శాతం ఉద్యోగుల హాజరుతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి పనిచేస్తాయని కేంద్రం చెబుతోంది. కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోనప్పటికీ, కరోనా పాజిటివిటీ కేసుల సంఖ్య మాత్రం బాగా తగ్గడంతో ఆఫీసుల్లో అందరు ఉద్యోగులూ ఫేస్ మాస్క్ ధరించి, కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు.

వాస్తవానికి ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పీక్‌లోకి కరోనా వస్తుంది అనే అంచనాల మధ్య అప్పటివరకు ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారు. కానీ, ముందుగానే కరోనా అదుపులోకి వచ్చిందనే వార్తల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు.