Itel S23: మొట్టమొదటి ఐ టెల్ 16 GB RAM స్మార్ట్‌ఫోన్‌ S23 విడుదల.. ధరెంతో తెలుసా?

ఈ నూతన స్మార్ట్ ఫోన్ ధర 8799 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. itel S23 తమ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తుందని కంపెనీ పేర్కొంది. అద్భుతమైన సూపర్ క్లియర్ 50MP వెనుక కెమెరా, ఫ్లాష్‌తో కూడిన ఆకట్టుకునే 8MP గ్లోయింగ్ AI ఫ్రంట్ కెమెరాతో వస్తుంది

Itel S23: మొట్టమొదటి ఐ టెల్ 16 GB RAM స్మార్ట్‌ఫోన్‌ S23 విడుదల.. ధరెంతో తెలుసా?

Updated On : June 10, 2023 / 8:41 PM IST

Itel S23: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన itel, దాని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన itel S23 ను సబ్-9k కేటగిరీలో విడుదల చేయనుంది. భారతదేశపు మొదటి 16 GB RAM ఫోన్‌ ఇదే. ఇది మెమరీ ఫ్యూజన్ ద్వారా అత్యధిక ర్యామ్ అందిస్తుంది. మొబైల్ పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేస్తూ itel S23 16 GB ప్రత్యేకంగా అమెజాన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉంది. itel గత కొన్ని నెలల్లో A60, P40 వంటి ఉత్పత్తులను (8,000 రూపాయలు) విడుదల చేసి మంచి ఆదరణను అందుకుంది.

Apple iPhone 11 Sale : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 11.. కేవలం రూ. 8,950కే సొంతం చేసుకోవచ్చు.. డోంట్ మిస్!

ఈ వినూత్న ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తితో ఐటెల్ మునుపెన్నడూ లేని విధంగా సబ్ 10K స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడానికి ఊవిళ్లూరుతోంది. ఈ నూతన స్మార్ట్ ఫోన్ ధర 8799 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. itel S23 తమ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తుందని కంపెనీ పేర్కొంది. అద్భుతమైన సూపర్ క్లియర్ 50MP వెనుక కెమెరా, ఫ్లాష్‌తో కూడిన ఆకట్టుకునే 8MP గ్లోయింగ్ AI ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అదనంగా itel S23, 8GB వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉండనుంది.

Sattva Lakeridge: హైదరాబాద్‌లో నియోపోలిస్‌లో ప్రారంభమైన సత్త్వ లేక్‌రిడ్జ్

ఈ ఆవిష్కరణ పై ఐటెల్ ఇండియా సీఈఓ అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ “నేడు వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. వారి ఇష్టాలు, ఎంపికలు, ఫ్యాషన్ వంటి అంశాల పరంగా తమకు కావాల్సినవి డిమాండ్ చేస్తున్నారు. అదీ కాక వినియోగ విధానాలలో సైతం పెద్ద మార్పు వచ్చింది. మొబైల్‌ ఫోన్లు ఇకపై కేవలం పరికరాలు మాత్రమే కాకుండా వినోదం, జీవనశైలిలో అంతర్భాగంగా మారాయి. ఐటెల్‌లో మేము వీటన్నిటికీ స్థానం కల్పించాం. అంతే కాకుండా అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్స్, నూతన సాంకేతికతతో కూడిన ఆవిష్కరణలను తీసుకురావడం ద్వారా మా వినియోగదారులకు సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాము” అని అన్నారు.