Itel Zeno 100 Pro Launch : మిలిటరీ గ్రేడ్, IR బ్లాస్టర్‌తో ఐటెల్ నుంచి 2 కొత్త ఫోన్లు.. కీలక ఫీచర్లు లీక్.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

Itel Zeno 100 Pro India Launch : ఐటెల్ కంపెనీ నుంచి ఈ నెల 16న భారత మార్కెట్లోకి ఐటెల్ జెనో 100 ప్రో సిరీస్ వస్తోంది. లాంచ్‌కు కీలక ఫీచర్లు రివీల్ అయ్యాయి.. ఓసారి లుక్కేయండి..

Itel Zeno 100 Pro India Launch

  • ఐటెల్ జెనో 100 ప్రో జూలై 16న భారత మార్కెట్లో లాంచ్
  • అమెజాన్‌లో జెనో 100 లైట్ పలు ఫీచర్లతో వస్తుంది
  • ఈ రెండు ఫోన్లలో మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఉంటుందని అంచనా

Itel Zeno 100 Pro India Launch : ఐటెల్ కంపెనీ కొత్త సిరీస్ తీసుకువస్తోంది. ఐటెల్ జెనో 100 ప్రో, జెనో 100 లైట్ అనే 2 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు కంపెనీ రెడీ అవుతోంది.

ట్రాన్సియన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని ఈ కంపెనీ లాంచ్ ముందే స్పెషల్ మైక్రోసైట్‌ ద్వారా ఈ ఫోన్లను టీజ్ చేసింది. కొన్ని కీలక ఫీచర్లను కూడా వెల్లడించింది. ఐటెల్ జెనో 100 ప్రోలో హీటింగ్, కింద పడినా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. అలాగే లైట్ వేరియంట్‌లో మిలిటరీ-గ్రేడ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందని అంచనా.

ఐటెల్ జెనో 100 ప్రో, జెనో 100 లైట్ ఫీచర్లు (అంచనా) :
అమెజాన్‌లో కొత్త ల్యాండింగ్ పేజీలో ఐటెల్ జీనో 100 ప్రో జూలై 16న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఎంఐఎల్-ఎస్టీడీ 810H మిలిటరీ-గ్రేడ్ మన్నిక అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో హీటింగ్, కిందపడినా తట్టుకునే సామర్థ్యం కూడా ఉంటుందని మైక్రోసైట్ ధృవీకరిస్తోంది. ఈ ఫోన్ టీజర్ ‘పాయింట్ అండ్ ట్యాప్ కంట్రోల్ కనెక్టివిటీ’ ఫీచర్‌ను కూడా సూచిస్తోంది.

టీవీలు, ఏసీ కంట్రోలింగ్ కోసం ఐఆర్ బ్లాస్టర్ :
ఇందులో ఇంటిగ్రేటెడ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉండొచ్చు. ఇదే నిజమైతే.. టీవీలు, ఏసీలు, ఇతర హోం అప్లియన్సెస్ వంటి ఐఆర్ సపోర్టెడ్ డివైజ్, ఐటెల్ స్మార్ట్‌ఫోన్‌తో నేరుగా కంట్రోల్ చేయొచ్చు. డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ కూడా కనిపిస్తోంది. ఏ సెన్సార్లు ఉంటాయి అనేదానిపై కచ్చితమైన వివరాలు రివీల్ కాలేదు.

Read Also : Tecno Camon 50 Ultra 5G : టెక్నో లవర్స్ గెట్ రెడీ.. ఖతర్నాక్ ఫీచర్లతో కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ వస్తోంది.. లాంచ్ డేట్ ఇదే..!

మరోవైపు, ఐటెల్ జీనో 100 లైట్ అనేక స్పెసిఫికేషన్లతో వస్తుంది. రాబోయే ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉండొచ్చు. డీటీఎస్-ఆధారిత స్పీకర్లు ఎంఐఎల్-ఎస్టీడీ మిలిటరీ-గ్రేడ్ మన్నికతో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో రానుంది. బ్రాండ్ లైనప్‌లో జీనో 100 ప్రో కన్నా తక్కువ ఉండొచ్చు.

అయితే, ఐటెల్ జెనో ప్రో మోడల్‌కు భిన్నంగా టీజర్ పేజీలో ఐటెల్ జీనో 100 లైట్ కమింగ్ సూన్ అని మాత్రమే పేర్కొంది. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రాబోయే ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రో మోడల్‌తో పాటే లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ధర, చిప్‌సెట్, కెమెరా స్పెసిఫికేషన్లు, సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లతో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.