Tecno Camon 50 Ultra 5G : టెక్నో లవర్స్ గెట్ రెడీ.. ఖతర్నాక్ ఫీచర్లతో కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ వస్తోంది.. లాంచ్ డేట్ ఇదే..!
Tecno Camon 50 Ultra 5G : టెక్నో నుంచి సరికొత్త కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ సన్నని ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ అందిస్తోంది. గ్లోబల్ మోడల్ 6,500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
Tecno Camon 50 Ultra 5G
- అమెజాన్ టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ టీజ్ చేసింది
- కామన్ 50 అల్ట్రా 5జీ సన్నని ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్‌తో వస్తుంది
- గ్లోబల్ మోడల్లో 6,500mAh బ్యాటరీ సెటప్ అందిస్తుంది
Tecno Camon 50 Ultra 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది. లాంచ్‌కు ముందే ఇమేజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్ వివరాలను కూడా టెక్నో టీజ్ చేసింది.
ఈ హ్యాండ్సెట్ అద్భుతమైన ప్రీమియం ఫీచర్లతో కామన్ 50 సిరీస్‌లో చేరనుంది. టెక్నో ఇండియన్ వేరియంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రివీల్ చేయలేదు. కానీ, అదనపు స్పెసిఫికేషన్లు, ధర, లభ్యత వివరాలపై ఓసారి లుక్కేయండి..
టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ భారత్ లాంచ్ వివరాలు :
కంపెనీ ప్రకారం.. రాబోయే టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ జూలై 17న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి అమెజాన్ మైక్రోసైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ లిస్టింగ్‌లో స్మార్ట్‌ఫోన్ సైప్రస్ గ్రీన్, మిస్టీ పర్పుల్ నెబ్యులా టైటానియం కలర్ ఆప్షన్లలో రానుంది.
మైక్రోసైట్లో ఫొటోలను పరిశీలిస్తే.. రౌండెడ్ కార్నర్ ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్‌తో రానుంది. వర్టికల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ అందిస్తుంది. ఈ మాడ్యూల్లో 3 భారీ కెమెరా సెన్సార్లు, మరొక సెన్సార్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ రెడ్ కలర్ యాక్సెంట్ ఉన్నాయి.
టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ ఫొటోగ్రఫీ కంటెంట్ క్రియేషన్ కోసం కొత్త ఏఐ ఫీచర్లతో రానుంది. ఈ హ్యాండ్సెట్ ఫొటోల కోసం ఏఐ ఆధారిత టూల్స్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైట్ షేప్ బ్యాటరీతో వస్తుందని అంచనా..
Read Also : Vivo T5 Lite 5G Launch : వివో T5 లైట్ 5జీ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?
టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ఫీచర్లు :
టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ, కామన్ 50 సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్‌గా రాబోతుంది. ఇప్పటికే ఎండబ్ల్యూసీ 2026లో ఫస్ట్ టైమ్ ప్రదర్శించారు. ఈ హ్యాండ్‌సెట్‌లో 144Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ చిప్సెట్ అందించనుంది. 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ స్టోరేజ్ అందిస్తుంది. HiOS16తో ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుందని కూడా అంచనా.
ఈ టెక్నో అల్ట్రా 5జీ గ్లోబల్ వేరియంట్లో 50ఎంపీ సోనీ LYT-700C ప్రైమరీ రియర్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో కెమెరా 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 13ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉండనుంది. 30fps వద్ద 4కే రిజల్యూషన్ వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా.
టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ఫీచర్లలో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 IP69K రేటింగ్, అలాగే MIL-STD-810 సర్టిఫికేషన్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీ, డాల్బీ అట్మోస్ ఆధారిత స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, NFC, బ్లూటూత్ 5.4, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB టైప్-సి, 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుందని అంచనా.
