ITR Advance Tax Deadline : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ నెల 15 వరకు డెడ్‌లైన్.. ఇప్పుడే పన్ను చెల్లించండి..!

ITR Advance Tax Deadline : అడ్వాన్స్ ట్యాక్స్ మూడో విడత గడువు డిసెంబర్ 15, 2024. పన్ను చెల్లింపుదారులు పెనాల్టీని నివారించడానికి గడువు తేదీకి ముందే ముందస్తు పన్ను చెల్లించాలి.

ITR Advance Tax Deadline

ITR Advance Tax Deadline : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఐటీఆర్ దాఖలు చేశారా? ఐటీఆర్ ముందస్తు పన్ను గడువు తేదీ డిసెంబర్ 15 వరకు మాత్రమే సమయం ఉంది. పన్ను చెల్లింపుదారులు జరిమానాలను నివారించడానికి, ఈ నెల 15 లోపు మూడవ ముందస్తు పన్ను వాయిదాను చెల్లించాలి. రూ. 10వేల కన్నా ఎక్కువ పన్ను చెల్లించాల్సిన వారు వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వ్యాపార ఆదాయం లేని సీనియర్ సిటిజన్‌లకు మినహాయింపు ఉంటుంది.

ఐటీఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ : అడ్వాన్స్ ట్యాక్స్ మూడో విడత గడువు డిసెంబర్ 15, 2024. పన్ను చెల్లింపుదారులు పెనాల్టీని నివారించడానికి గడువు తేదీకి ముందే ముందస్తు పన్ను చెల్లించాలి.

ముందస్తు పన్ను అంటే ఏమిటి? :
అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఆదాయపు పన్నులో ఒక భాగం. మొత్తం మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా వివిధ గడువులలో వాయిదాలలో చెల్లించస్తారు. వ్యక్తులు, కార్పొరేట్లు ఇద్దరూ చెల్లించాలి. ఆదాయపు పన్ను (IT) చట్టం, 1961లోని సెక్షన్ 208 ప్రకారం.. సంవత్సరానికి రూ. 10వేల కన్నా ఎక్కువ పన్ను కలిగిన పన్ను చెల్లింపుదారులు ముందస్తు పన్ను రూపంలో వాయిదాలలో పన్ను చెల్లించాలి.

అయితే, సీనియర్ సిటిజన్లు అంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పన్ను చెల్లింపుదారులు. ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి ఎలాంటి ఆదాయం లేని వారు ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

పన్ను చెల్లింపుదారులు గడువు తేదీకి ముందు ముందస్తు పన్ను చెల్లింపులు చేయడంలో విఫలమైతే.. ఐటీ చట్టంలోని సెక్షన్లు 234బీ, 234సీ ప్రకారం.. నెలకు 1శాతం జరిమానా వడ్డీ విధిస్తారు. మూడో విడత అడ్వాన్స్‌ ట్యాక్స్‌కు గడువు డిసెంబర్‌ 15.. ఆదివారం సెలవు. ఇలాంటి సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు మరుసటి రోజు డిసెంబర్ 16, సోమవారం ముందస్తు పన్ను చెల్లించవచ్చు.

ముందస్తు పన్ను చెల్లింపుకు సంబంధించిన నిబంధనల ప్రకారం.. “ఏదైనా వాయిదాల ముందస్తు పన్ను చెల్లింపుకు చివరి రోజు బ్యాంకులు మూసివేసిన రోజు అయితే.. పన్ను చెల్లింపుదారుడు వెంటనే మరుసటి రోజున ముందస్తు పన్ను చెల్లించాలి”. నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ముందస్తు పన్నును నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు.

ముందస్తు పన్ను కోసం వాయిదా తేదీలివే :
మొదటి విడత : బకాయిల్లో 15శాతంతో కూడిన ముందస్తు పన్నును జూన్ 15న లేదా అంతకు ముందు చెల్లించాలి.
రెండవ విడత : బకాయిల్లో 45శాతంతో కూడిన ముందస్తు పన్నును సెప్టెంబర్ 15న లేదా అంతకు ముందు చెల్లించాలి.
మూడవ విడత : బకాయిల్లో 75శాతంతో కూడిన ముందస్తు పన్నును డిసెంబర్ 15న లేదా అంతకు ముందు చెల్లించాలి.
నాల్గవ లేదా చివరి వాయిదా : బకాయిల్లో 100 శాతం పూర్తి చేసి.. మార్చి 15 లేదా అంతకు ముందు అడ్వాన్స్ పన్ను చెల్లించాలి.

ముందస్తు పన్ను ఎలా చెల్లించాలి? :

  • ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • షార్ట్ లింక్‌ల ట్యాబ్ నుంచి ‘e-Pay’ ఆప్షన్ ఎంచుకోండి.
  • పాన్, మొబైల్ నంబర్ వివరాలను ఎంటర్ చేసి ‘Continue’ ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌లో OTP అందుకుంటారు.
  • OTPని ఎంటర్ చేసి, ‘Proceed’ ఆప్షన్ ఎంచుకోండి.
  • ‘ఆదాయ పన్ను’ ఎంపికపై క్లిక్ చేసి, ‘Continue’ ఎంచుకోండి.
  • ఫోన్ నంబర్, అడ్రస్, అసెస్‌మెంట్ సంవత్సరం, ఇమెయిల్-ఐడీ, బ్యాంక్ పేరు మొదలైన మీ వివరాలను ఎంటర్ చేయండి.
  • వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, వెబ్‌సైట్ పేమెంట్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
  • అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
  • ముందస్తు పన్ను చెల్లింపు పూర్తవుతుంది.
  • మీరు చలాన్ నంబర్‌తో సహా వివరాలను అందుకుంటారు.
  • ముందస్తు పన్ను చెల్లింపుల గురించి మరిన్ని వివరాల కోసం.. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Read Also : Skoda Kylaq SUV : స్కోడా కైలాగ్ ఎస్‌‌యూవీ సరికొత్త రికార్డు.. కేవలం 10 రోజుల్లోనే 10వేల బుకింగ్స్..!