Jio 5g Phone May Launch This Week
Jio 5G Phone : వచ్చే వారమే రిలయన్స్ నుంచి చౌకైన జియో కొత్త 5G ఫోన్ రాబోతోంది. ప్రస్తుత జియో 4జీ స్మార్ట్ ఫోన్ల కంటే సరికొత్త ఫీచర్లతో జియో 5G ఫోన్ యూజర్లను ఆకట్టుకోనుంది. దీని ధర మార్కెట్లో రూ.5వేల లోపే ఉండొచ్చునని అంచనా. ఈ కొత్త జియో 5జీ ఫోన్ జూన్ 24న రిలయన్స్ వార్షిక ప్రధాన సమావేశం (AGM)లో లాంచ్ చేయనుంది. ప్రస్తుత 5జీ స్మార్ట్ ఫోన్ల కంటే ఈ కొత్త జియో స్మార్ట్ ఫోన్ చాలా సరసమైన ధరకే అందుబాటులో రానుంది.
4G స్మార్ట్ ఫోన్ల కంటే కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. AGM ఈవెంట్లో రిలయన్స్.. సరసమైన ధరకే కొత్త ల్యాప్ టాప్ Jio Book కూడా ఆవిష్కరించనుంది. గూగుల్ భాగస్వామ్యంతో కొత్త జియో 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. గత ఏడాదిలో AGM సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ ఇదే విషయాన్ని వెల్లడించారు. తమ కంపెనీలో గూగుల్ 7.7 శాతం వాటాను 33,737 కోట్లతో పెట్టుబడి పెట్టినట్టు వెల్లడించారు.
కొత్త జియో 5జీ స్మార్ట్ ఫోన్ లో ఏయే ఫీచర్లు ఉండే అవకాశం ఉందంటే.. మినిమం స్పెషిఫికేషన్లతో రానుంది. యూజర్లకు ఎంతో సౌకర్యవంతమైన ఎక్స్ పీరియన్స్ అందించనుంది. ఆండ్రాయిడ్ ఆధారిత కస్టమజైడ్ సాఫ్ట్ వేర్ ను గూగుల్ అందిస్తోంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లలో ఉండే ఆండ్రాయిడ్ వన్ వెర్షన్ ఆధారంగా పనిచేయనుంది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ JioOSపేరుతో రానుంది. రిలయన్స్ జియో బుక్ ల్యాప్ టాప్ లో LTE కనెక్టవిటీ ఫీచర్ తో పాటు క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 665 పవర్ తో పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేయనుంది.