Jio 5G Services : దేశంలో 4 నగరాల్లో జియో 5G సర్వీసులు.. ఢిల్లీలో 600mbps మార్క్ దాటిన డౌన్‌లోడ్ స్పీడ్

Jio 5G Services : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) కొద్ది రోజుల క్రితమే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్‌లో 5G సర్వీసును ప్రారంభించింది.

Jio 5G rolling out in 4 cities, download speed touches 600mbps mark in Delhi

Jio 5G Services : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) కొద్ది రోజుల క్రితమే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్‌లో 5G సర్వీసును ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసితో సహా 4 నగరాల్లో Jio 5G అందుబాటులో ఉంది. Jio 5G వెల్‌కమ్ ఆఫర్ కింద.. కంపెనీ అర్హులైన యూజర్లకు 1gbps ఫ్రీ అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది.

Jio 5G ఆఫర్ ఎంత స్పీడ్‌ అందిస్తునేది తెలియకపోవచ్చు. ఊక్లాస్ స్పీడ్‌టెస్ట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. టెలికాం ఆపరేటర్లు జియో (Jio 5G Services) ఎయిర్‌టెల్ (Airtel 5G Services) కొంతకాలంగా 5G సర్వీసును టెస్టింగ్ చేస్తున్నాయి. అందులోనూ 809.94mbps వరకు 5G డౌన్‌లోడ్ స్పీడ్‌ను పొందవచ్చు.

ఇప్పటికీ 5G నెట్‌వర్క్‌లను ఆపరేటర్లు రీకాలిబ్రేట్ చేస్తున్నారనే డేటా సూచిస్తుంది. ఈ నెట్‌వర్క్‌లు కమర్షియల్ ఎంట్రీ స్పీడ్ మరింత స్థిరంగా ఉంటుందని అంచనా వేసాయని నివేదిక పేర్కొంది. జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel) రెండూ తమ 5G సర్వీసులను అందిస్తున్న నాలుగు నగరాల్లో మధ్యస్థ 5G డౌన్‌లోడ్ స్పీడ్ పోల్చింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసిలో జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న డేటా స్పీడ్‌ను ఓసారి పరిశీలించండి.

Jio 5G rolling out in 4 cities, download speed touches 600mbps mark in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో, ఎయిర్‌టెల్ (Airtel) 197.98mbps వద్ద దాదాపు 200 Mbps మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్‌ని చేరుకుంది. జూన్ నుంచి రిలయన్స్ జియో 600mbps (598.58mbps నిర్దిష్టంగా) తాకింది. కోల్‌కతాలో ఎయిర్‌టెల్ 33.83mbps మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందించగా, రిలయన్స్ జియో జూన్ నెల నుంచి 482.02mbps మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందించింది. ముంబైలో ఎయిర్‌టెల్ 271.07mbps మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను తాకింది.

జూన్ నుంచి Jio 515.38mbps మీడియన్ డౌన్‌లోడ్‌ను అందించింది. వారణాసిలో, ఎయిర్‌టెల్ 516.57mbps వద్ద 5G మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందుకుంది. జూన్ 2022 నుంచి Jio 485.22mbps మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను తాకింది. రిలయన్స్ జియో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసితో సహా 4 నగరాల్లో జియో 5G సర్వీస్‌ను అందిస్తోంది.

Jio 5G rolling out in 4 cities, download speed touches 600mbps mark in Delhi

మరోవైపు.. ఎయిర్‌టెల్ ప్రస్తుతం 8 నగరాల్లో తన 5G సర్వీసులను అందిస్తోంది. ఊక్లాస్ ఇటీవల నిర్వహించిన యూజర్ల సర్వే ప్రకారం.. దాదాపు 89 శాతం మంది భారతీయ స్మార్ట్‌ఫోన్ యూజర్లు 5Gకి అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ కొత్త 5G ఫలితాలు భారత్‌లో ప్రస్తుతం నెట్‌వర్క్ కన్నా 5G వేగం చాలా ఎక్కువగా చూపిస్తున్నాయి. ఈ ముందస్తు ఫలితాలను జాగ్రత్తగా చేరుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం artificial controlled testing పరిస్థితులలో అయినా 5G డివైజ్‌లు చాలా వేగవంతమైన వేగాన్ని సాధించగలవని ఇప్పటికే చూపిస్తున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G Services : మీ ఫోన్‌లో జియో 5G సపోర్టు చేయడం లేదా? ఈ 3 తప్పులే కారణమని తెలుసా?