Jio 5G Services : మీ ఫోన్‌లో జియో 5G సపోర్టు చేయడం లేదా? ఈ 3 తప్పులే కారణమని తెలుసా?

Jio 5G Services : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. కానీ, జియో యూజర్ల అందరికి అందుబాటులోకి రాలేదు.

Jio 5G Services : మీ ఫోన్‌లో జియో 5G సపోర్టు చేయడం లేదా? ఈ 3 తప్పులే కారణమని తెలుసా?

Not able to use Jio 5G on your phone_ Three things you are doing wrong

Jio 5G Services : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. కానీ, జియో యూజర్ల అందరికి అందుబాటులోకి రాలేదు. ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే Jio 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రాబోయే నెలల్లో మరిన్ని నగరాల్లో 5G సర్వీసులను అందుబాటులోకి తెస్తామని జియో వెల్లడించింది.

2023 చివరి నాటికి పాన్ ఇండియాగా 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ధృవీకరించింది. ప్రస్తుతం, Jio 5G కేవలం 4 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ నగరాల్లోని ప్రతి ఒక్కరూ ఉపయోగించలేరని తెలుసా? దానికి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Not able to use Jio 5G on your phone_ Three things you are doing wrong

Not able to use Jio 5G on your phone_ Three things you are doing wrong

మీరు వాడేది 5G స్మార్ట్‌ఫోన్‌ కాకపోవచ్చు :
ఏదైనా 5G సర్వీసులు Jio లేదా Airtel ఏదైనా కావొచ్చు.. 5G ఫోన్‌లలో మాత్రమే సపోర్టు చేస్తుందని గమనించాలి. 5G ప్రారంభ స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే Jio 5G యాక్సెస్ పొందుతాని గుర్తించాలి. అయితే, అన్ని 5G ఫోన్‌లు Jio 5G సర్వీసులను యాక్సస్ చేయలేరని కూడా గమనించాలి. 5G ఫోన్‌లు విజయవంతంగా Jio 5Gని యాక్సస్ చేసుకోవాలంటే OEMలు ముందుగా ఫోన్‌లో OTA అప్‌డేట్‌లను అందించాలి.

తద్వారా డివైజ్‌లో 5G నెట్‌వర్క్‌ను యాక్సస్ చేసుకోవచ్చు. Jio 5Gని సులభంగా యాక్సస్ చేసుకోగల బ్రాండ్‌ల నుంచి 5G ఫోన్‌ల జాబితాను ఓసారి చూడండి. మీరు 3G లేదా 4G ఫోన్ లేదా నాన్-కాంపాటబుల్ 5G ఫోన్‌ వాడుతున్నట్టయితే.. మీరు 5Gని వాడలేరని గుర్తించాలి. 5G ఫోన్ యూజర్లు సెట్టింగ్‌ల మెనుకి వెళ్లి ఏవైనా కొత్త అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేయాలి.

సరైన జియో ప్లాన్‌ వాడటం లేదా? :
Jio 5G సర్వీస్ రూ. 239 కన్నా ఎక్కువ ప్లాన్‌లపై మాత్రమే పనిచేస్తుందని నివేదించింది. Jio 5Gకి సపోర్ట్ చేసే ప్లాన్‌ల గురించి కంపెనీ ఇంకా చాలా వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ, 5G డేటా స్పీడ్‌ని యాక్సెస్ చేసేందుకు అర్హత కలిగిన యూజర్లు రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో తమ నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫోన్‌ 5G సపోర్టు చేసే 4 నగరాల్లో ఒకదానిలో ఉండి.. ఇప్పటికీ 5Gని యాక్సస్ కాలేకపోతే.. మీరు సపోర్టు ప్లాన్‌లో లేకపోవచ్చు.

Not able to use Jio 5G on your phone_ Three things you are doing wrong

Not able to use Jio 5G on your phone_ Three things you are doing wrong

మీ ఫోన్ 5G ఉన్న నగరంలో లేదు :
Jio 5G ప్రస్తుతానికి 4 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉందని గమనించాలి. ఈ నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసి ఉన్నాయి. మీరు వేరే నగరంలో నివసిస్తుంటే.. రాబోయే వారాలు/నెలల్లో Jio 5G మీకు అందుబాటులో ఉంటుంది. జియో 2023 చివరి నాటికి పాన్ ఇండియాగా 5G సర్వీసులను ధృవీకరించింది.

ఇప్పుడు, మీరు 4 నగరాల్లో ఒకదానిలో నివసిస్తుంటే.. అర్హత కలిగిన 5G ఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? Jio 5G వెల్‌కమ్ ఆఫర్ ఇన్వైట్ చేసేందుకు మీరు MyJio యాప్‌కి వెళ్లాలి. కొత్త వెల్‌కమ్ ఆఫర్ కింద, Jio 1gbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. కంపెనీ కొత్త 5G ప్లాన్‌లను ప్రారంభించే వరకు 4G ప్లాన్‌లతో ఉచిత 5G సేవలను అందజేస్తుందని వెల్లడించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G Welcome Offer : జియో 5G వెల్‌కమ్ ఆఫర్.. ఇంతకీ ఇదేలా పొందాలి? ఎవరు అర్హులంటే?